Virat Kohli takes blame for RCB defeat తొలి మ్యాచ్ ఓటమికి కారణం నేనే: విరాట్ కోహ్లీ

Virat kohli takes blame for rcb defeat to kolkata knight riders

IPL, IPL news, IPL 2018, Indian Premier League, Virat Kohli, Royal Challengers Bangalore, Kolkata Knight Riders, Indian Premier League 2018, Indian Premier League news, KKR v RCB, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Virat Kohli accepted his role in Royal Challengers Bangalore’s defeat to Kolkata Knight Riders in the Indian Premier League.

తొలి మ్యాచ్ ఓటమికి కారణం నేనే: విరాట్ కోహ్లీ

Posted: 04/09/2018 07:02 PM IST
Virat kohli takes blame for rcb defeat to kolkata knight riders

కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో తమ ఓటమికి కారణం ఏంటో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పేశాడు. 176 పరుగుల భారీ స్కోరు చేసినా సరిపోలేదని, మరో 15 పరుగులు చేసి ఉండాల్సిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 10-15 పరుగులు తక్కువగా చేయడంతోపాటు కీలక సమయాల్లో సరిగ్గా ఆడలేకపోయామని వివరించాడు. తన వరకు అయితే డాట్ బాల్స్ ఎక్కువగా ఆడేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస బంతులకే డివిలియర్స్, తాను వెనుదిరగడం జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నాడు.

అయితే జట్టు పరంగా చూస్తే బాగానే ఆడామని సంతృప్తి వ్యక్తం చేసిన విరాట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు అంతే పట్టుదలగా ఫీల్డింగ్ లోనూ రాణించలేకపోయిందని అన్నాడు. ఔట్ ఫీల్డ్ లో కొన్ని పొరబాట్లు జట్టు ఓటమికి కారణమయ్యాయని, అయితే అదే నైట్ రైడర్స్ కు బలానిచ్చాయని చెప్పాడు. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 31 పరుగులు చేశాడు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కోల్‌కతా ఓపెనర్ సురేశ్ నరైన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2018  Virat Kohli  Royal Challengers Bangalore  Kolkata Knight Riders  KKR v RCB  cricket  

Other Articles