చక్కని స్పోటివ్ స్పిరిట్ తో అడుతున్న క్రికెట్ లోకి జాత్యాహంకారం కూడా ప్రవేశించింది. తాము చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే.. అదో రకమైన జాత్యాహంకార వ్యాఖ్యలకు దిగుతూ అవతల జట్టు క్రికెటర్లను టార్గెట్ చేయడం సబబు కాదన్న విషయం కూడా క్రికెట్ బోర్డు ఛీప్ లకు కూడా తెలియకపోవడం దారుణం. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా తీరు కూడా అలాగే వుంది. తమ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ ఆ దేశ బోర్డు చీఫ్ రంగంలోకి దిగి దారుణ వ్యాఖ్యలకు పాల్పడింది.
బెంగళూరు టెస్టులో డీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావించిన జేమ్స్ సూధర్ లాండ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారీ అన్న పదమే తెలియదని ఎద్దేవా చేశారు. సద్దుమణుగుతున్న ఈ విషయాన్ని మళ్లీ రేపిన ఆయన తమ జట్టు కెప్టెన్ ను వెనకేసుకువచ్చారు. డీఆర్ఎస్ ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి తెలుసుకోమ్మని ఆయనే స్మీత్ కు సలహా ఇచ్చినట్లుంది ఆయన వాలకం చూస్తే. అది చాలదన్నట్లు టీమిండియా కెప్టెన్ పై రుసరుసలాడారు.
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి 'సారీ' అనే పదాన్ని ఉచ్చరించడం తెలియదేమో అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. తప్పు చేసినవారికి వెనకేసుకువచ్చి.. అది తప్పు అని అరచిన వారిన సారీ చేప్పాలనడమే క్రికెట్ అస్ట్రేలియా తత్వంగా మార్చుకున్నట్లుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన సదర్లాండ్, సారీ అన్న పదం ఉందన్న విషయం తెలియదని ఎద్దేవా చేశాడు. దీనిపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఛీటర్ ను ఛీటర్ అని అనక ఇంకేమంటారని ప్రశ్నిస్తున్నారు. ముందు స్మీత్ చేత సారీ చేప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more