షేన్ వార్న్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఇతనే.. Kohli is the world's best batsman says Shane Warne

Virat kohli is the no 1 batsman in the world says shane warne

Cricket, India, Australia, Virat Kohli, Shane Warne, Ravichandran Ashwin, ravindra jadeja, india vs australia, cricket

Virat Kohli is the undoubtedly the number one batsman in the world, and is better than AB de Villiers among others said australia spin legend Shane Warne

షేన్ వార్న్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఇతనే..

Posted: 02/23/2017 08:16 PM IST
Virat kohli is the no 1 batsman in the world says shane warne

అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తూ ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో నంబర్ వన్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లినేనని కొనియాడాడు. దక్షిణాఫ్రికా  స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కంటే కోహ్లినే అత్యుత్తమ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఇటీవల కాలంలో విరాట్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలే అతన్ని అగ్రస్థానంలో నిలిపాయన్నాడు.

'విరాట్ కోహ్లి వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు. వరుస విరామాల్లో సెంచరీలు చేస్తూ విరాట్ దూసుకుపోతున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవ్ రిచర్డ్స్, భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లతో పోల్చదగిన ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లి. నేను విరాట్ కు పెద్ద అభిమాన్ని. అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. కెప్టెన్ గా విరాట్ కోహ్లి దూకుడును కూడా ఇష్టపడతా. ఒక క్రికెటర్గా విరాట్ అంటే నాకు అభిమానం. అతనొక భిన్నమైన ఆటగాడు'అని వార్న్ తెలిపాడు. ఈ సిరీస్లో భారత క్రికెట్ జట్టే ఫేవరెట్ అని వార్నర్ జోస్యం చెప్పాడు. భారత్ ను స్వదేశంలో ఓడించడం ఆసీస్ కు అంత సులువు కాదన్నాడు.ఇది కచ్చితంగా స్టీవ్ స్మిత్ సేనకు పరీక్ష అని వార్న్అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles