వీరూ, కరుణ్ ల రికార్డులు బద్దలుకొడతా: రాహుల్ I have 199 reasons to smile: Lokesh Rahul

I have 199 reasons to smile lokesh rahul

india vs england, k lokesh rahul, KL rahul misses diuble century, rahul double century, double century, chennai test, fifth test

I have to be grateful for the runs I have got. I have 199 reasons to smile. I was just one run away from getting a double hundred. That's the way the game goes. You don't always get what you want says kl rahul

వీరూ, కరుణ్ ల రికార్డులు బద్దలుకొడతా: రాహుల్

Posted: 12/23/2016 06:10 PM IST
I have 199 reasons to smile lokesh rahul

ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న అటగాడిగా అందరికీ గుర్తుండిపోయాడు. అయితే తాన చేయి జారిన డబుల్ సెంచరీ మళ్లీ సాధిస్తానని, అంతేకాకుండా తన సహచరుడు కరుణ్ నాయర్, టీమిండియా మాజీ ఓపెనింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను కూడా అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా జరిగిన చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 199 పరుగులు చేసి.. ఒక చెత్త షాట్ కొట్టి ఔటయ్యానని తన అవేదనను వ్యక్తం చేశాడు.

డబుల్ సెంచరీని మిస్ కావడం చాలా బాధగానే ఉందని... అయితే, క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణమే అని రాహుల్ అన్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే డకౌట్ కావడం... డబుల్ సెంచరీనీ మిస్ కావడం... ఇలాంటివన్నీ మన ఊహకు అందవని చెప్పాడు. మిడిల్ స్టంప్ కు వస్తుందనుకున్న బంతి ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లిందని... ఆ బాల్ ను వదిలేద్దామనే అనుకున్నానని, కానీ అనవసరంగా ఆడానని... దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయందని తెలిపాడు. కాకపోతే మంచి స్కోర్ చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అదే తాను నవ్వేందుకు 199 కారణాలను కల్పిస్తుందని రాహుల్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  k lokesh rahul  double century  chennai test  fifth test  

Other Articles