లంకపై గెలుపుతో ఫైనల్స్ కు చేరిన టీమిండియా India demolish Sri Lanka to reach final

Mithali raj ekta bisht star as india storm into asia cup final

india vs sri lanka women's cricket scores,india vs sri lanka cricket score,mithali raj,india women's cricket team,sri lanka women's cricket team,Asian Cricket Council Women's Twenty20 Asia Cup,Women's T20 Asia Cup 2016,women's cricket,women's t20 cricket

India women's cricket team have registered their fourth consecutive victory of the Asian Cricket Council Women's T20 Asia Cup.

లంకపై గెలుపుతో ఫైనల్స్ కు చేరిన టీమిండియా

Posted: 12/01/2016 06:56 PM IST
Mithali raj ekta bisht star as india storm into asia cup final

ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంటులో భారత్ తన జోరు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్, ఆ తరువాత దాయాధి పాకిస్తాన్ లపై అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత్.. ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా శ్రీలంకపై విజయాన్ని నమోదు చేసుకుంది. లంకేతో జరిగిన మ్యాచ్లో టీమిండియా మహిళలు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. లంక మహిళల్ని 69 పరుగులకే కట్టడి చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

ఓపెనర్ మిథాలీ రాజ్(62) హాఫ్ సెంచరీ సాధించగా,మందనా(21), వేదా కృష్ణమూర్తి(21)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన లంక మహిళలు పోరాడకుండానే చేతులెత్తేశారు. దిలానీ మండోదర(20), ప్రశాదనీ వీరక్కోడి(14)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా క్రీడాకారిణులంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు.

భారత మహిళల్లలో ఏక్తా బిస్త్,ప్రీతి బోస్లు చెరో మూడు వికెట్లతో లంకను కట్టడి చేయగా,జులాన్ గోస్వామి,అనుజా పటేల్, పూనమ్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది. ఈ తాజా మ్యాచ్లో విజయంతో భారత్ వరుసగా నాల్గో గెలుపును సొంతం చేసుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, పాకిస్తాన్లపై భారత్ వరుసగా విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Srilanka  womens cricket  T20 asian cup  Mithali Raj  Harmanpreet Kaur  

Other Articles