మొహాలీ టెస్టులో దుమ్మురేపిన విరాట్ సేన England set 103-run target for India

Ind vs eng india beat england by eight wickets lead series 2 0

india vs england, virat kohli, kohli, mohali test, joe root, root, kevin pietersen, pietersen, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Parthiv Patel and Cheteshwar Pujara shared a 81-run stand as India defeated England by eight wickets in Mohali.

మొహాలీ టెస్టులో దుమ్మురేపిన విరాట్ సేన

Posted: 11/29/2016 05:25 PM IST
Ind vs eng india beat england by eight wickets lead series 2 0

మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పర్యాటక జట్టు ఇంగ్లండ్ పై టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. మరో రోజు మిగిలివుండగానే ఇంగ్లాండ్ నిర్ధేశించిన స్వల్ప విజయలక్ష్యాన్ని చేధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలను తన ఖాతాలోకి వేసుకుంది. మరో టెస్టులో విజయం సాధిస్తే.. టెస్టు సిరీస్ విరాట్ సేన వశమౌతుంది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ విజయం అందుకోవాలని ఎంతో ఆశగా ఉవ్విళ్లూరిన టీమిండియాకు నిరాశే ఎదురైంది.

మూడో టెస్టు తొలిరోజు నుంచి పర్యాటక జట్టుపై పూర్తి అధిపత్యం ప్రదర్శించిన టీమిండియా నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ గా నిష్క్రమించనప్పటికీ  మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(67 నాటౌట్;54 బంతుల్లో11 ఫోర్లు,1 సిక్స్) రాణించాడు. విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా చటేశ్వర పూజారా(25) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(6నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాల వైపు నడిపించాడు.

అంతకుముందు 78/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జో రూట్(78), హషిబ్ హమిద్(59 నాటౌట్), వోక్స్(30)లు భారత బౌలర్లను నిలువరించే యత్నం చేయడంతో మొత్తానికి 236 పరుగుల వద్ద ఇంగ్లాండ్ చాపచుట్టేసింది. హమిద్ తో కలిసి 47 పరుగులు జత చేసిన తరువాత ఓవర్ నైట్ ఆటగాడు జో రూట్ ఏడో వికెట్ గా పెవీలియన్ దారి పట్టాడు.

ఆ తరుణంలో హమిద్-వోక్స్ మద్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది, దీంతో ఈ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జంట 43 పరుగులు జోడించిన తరువాత వోక్స్ ఔటై వెనుదిరిగాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రషిద్ డకౌట్ గా అవుటయ్యాడు. కాసేపటికే జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  Team india  test series  mohali test  

Other Articles