ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు కోరుతూ బిసిసిఐ లేఖ BCCI requests ECB to bear expenses on India tour

Bcci requests ecb to bear expenses on india tour

bcci, bcci india, bcci cricket, anurag thakur, cricket bcci, lodha panel, bcci vs lodha, lodha vs bcci, virat kohli, kohli, joe root, root, kevin pietersen, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

BCCI has asked its English counterparts to bear the expenses of the England cricketers during the two month-long stay in the sub-continent.

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు కోరుతూ బిసిసిఐ లేఖ

Posted: 11/04/2016 06:28 PM IST
Bcci requests ecb to bear expenses on india tour

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం దేశంలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈనెల 9 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ క్షమాపణలు కోరింది. అదేంటి అనుకుంటున్నారా..? మ్యాచ్ ప్రారంభానికి ముందు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేంటన్న డౌట్స్ కలుగుతున్నాయా..?

ఐదు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచుల ఆడాలని ముందస్తు ప్రణాళికతో భారత్ లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. వారి ఖర్చులను వారే భరించేలా కోరుతూ బిసిసిఐ ఈసీబికి లేఖ రాసింది. ఎందుకంటారా..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) లోథా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు జారీ చేసిన‌ ఆదేశాలను అమ‌లు చేయ‌లేమ‌ని చెప్పింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఖర్చులను బోర్డు భరించలేద‌ని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాస్తూ ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌ హోటల్, ప్రయాణ ఖర్చులను వారే పెట్టుకోవాల‌ని లేఖ రాసింది.

ఒకవేళ తాము ఇంగ్లాండ్ ఆటగాళ్ల బిల్లులు చెల్లిస్తే ఆ మొత్తం బోర్డుకు తిరిగివ్వాలని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఈసీబీ ప్రతినిధి మాత్రం ముందుగా నిర్ణ‌యించిన‌ షెడ్యూల్ ప్రకారమే భార‌త్‌, ఇంగ్లండ్‌ సిరీస్ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. అయితే, లోథా ప్యానెల్, బీసీసీఐ మధ్య వివాదం మరింత చెల‌రేగే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్లు, ఈ ప్ర‌భావం సిరీస్ పై ప‌డే అవకాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిధులు విడుదల కాకపోతే సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదంటూ బీసీసీఐ లోథా ప్యానెల్‌ని విమ‌ర్శిస్తోన్న నేప‌థ్యంలో స్పందించిన‌ కమిటీ, ఇంగ్లండ్‌తో సిరీస్ రద్దు అయితే, దానికి కార‌ణం త‌మ‌ది కాద‌ని, బోర్డుదే అవుతుంద‌ని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs england  Team india  BCCI  ECB  Cricket  

Other Articles