In emotional speech, MS Dhoni urges India to ‘enjoy’ Test season

Dhoni s inspirational speech to team india

ms dhoni, ms dhoni india, india ms dhoni, anil kumble, rahul dravid, virat kohli, india west indies, sportrs news, sports, cricket news, cricket

MS Dhoni, in an emotional address to India's Test squad, urged the bunch to stick together and enjoy the upcoming Test season.

విండీస్ పర్యటనకు వెళ్లే జట్టుతో ధోని భావోద్వేగ ప్రసంగం

Posted: 07/05/2016 06:28 PM IST
Dhoni s inspirational speech to team india

ప్రతీ ఒక్కరి జీవితంలో సరదా అనేది ఉంటే సక్సెస్ దానింతటే అదే వస్తుందని తెలిపిన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇవాళ జట్టులోని సభ్యులందరూ ఒకరినినోకరు అర్థం చేసుకుని సహకరించుకుంటే.. విజయం దానంతట అదే వస్తుందని అన్నాడు, వెస్టిండీస్ తో సుదీర్ఘ టెస్టు సిరీస్ కు బయలుదేరే భారత జట్టును ఉద్దేశించి చేసిన ప్రసంగంలొ ఆయన బావోద్వేగానికి లోనయ్యారు. టెస్టు క్రికెట్ కు విడ్కోలు పలికిన తరువాత టీమిండియా చేస్తున్న సుదీర్ఘ పర్యటన ఇదే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే జట్ట సభ్యులనుద్దేశించి మాట్లాడాడు. ఈ సుదీర్ఘ సీజన్ ను ఆటగాళ్లు చక్కగా వినియోగించుకోవాలని, మైదానంలో ఒకరితో ఒకరు సమన్వయంతో ఆడాలని అన్నాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే, విజయం దానంతట అదే వెన్నంటి నడిచి వస్తుందని తెలిపాడు. క్రికెట్ ను కూడా ఓ వినోద సాధనంగా భావించాలని, ఇంత పెద్ద పర్యటనను తాను ఆడబోవడం లేదని ఆలోచిస్తేనే బాధ కలుగుతోందని తెలిపాడు.

ఇక్కడున్న వాళ్లలో అత్యధికులు ఐదేళ్ల వయసు నుంచే బ్యాటు పట్టుకున్నారని, గత రెండు మూడేళ్ల వ్యవధిలోనే జట్టులోకి వచ్చారని గుర్తు చేశాడు. సీనియర్లు జట్టుకు దూరమైన తరువాత భారత జట్టు తిరిగి టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో సమీప భవిష్యత్తులో ఆడనున్న 17 మ్యాచ్ లు ఎంతో కీలకమైనవని, ఆటగాళ్లు విజయం సాధించాలని కోరాడు. ధోనీ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  india  west indies  BCCI  Cricket  

Other Articles