Yuvraj Singh is my idol says Mumbai Indians all-rounder Krunal Pandya

I idolise yuvraj singh says krunal pandya

Indian Premier League, IPL 2016, IPL 9, Krunal Pandya, Yuvraj Singh, mumbai indians, bating order, mumbai indians ipl, delhi dare devils, delhi dare devils ipl, game plan, cricket ipl, cricket

Mumbai Indians' all-rounder Krunal Pandya is a big fan of swashbuckling cricketer Yuvraj Singh and idolises the Punjab all-rounder who is playing for Sunrisers Hyderabad this IPL season.

యువరాజ్ సింగ్ కు నేను పెద్ద అభిమానిని..

Posted: 05/18/2016 05:52 PM IST
I idolise yuvraj singh says krunal pandya

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్కు తాను పెద్ద అభిమానినని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. యువరాజ్ ఆటను ఎక్కువ ఇష్టపడటం కాకుండా, అతనినే ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు.'నేను తరచు యువరాజ్ సింగ్ క్రికెట్ను చూస్తూ ఉంటా. నేను యువరాజ్ కు అతి పెద్ద అభిమాని కావడంతోనే అతని ఆటపై మక్కువ పెంచుకున్నా. నాకు యువరాజ్ సింగే స్ఫూర్తి' అని  కృనాల్ తెలిపాడు. ఆల్ రౌండర్లలో ఎవర్నీ ఎక్కువ ఇష్టపడతారు అనే ప్రశ్నకు కృనాల్ పై విధంగా స్పందించాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్లో కృనాల్ 37 బంతుల్లో 86 పరుగులు చేసి ముంబై భారీ విజయంలో సహకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తన ప్రస్తుత ఐపీఎల్ ఆట తీరు పట్ల కృనాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తనకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించినట్లు కృనాల్ అభిప్రాయపడ్డాడు.  భవిష్యత్తులో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తానని తెలిపాడు. మన ప్రతిభ బయట తీసిన మరుక్షణమే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని కృనాల్ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Krunal Pandya  mumbai indians  Yuvraj Singh  cricket  

Other Articles