బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలీర్స్ ఆడిన దూకుడు ఇన్నిగ్స్ను పలువురు క్రికెటర్లు ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేస్తే, ఏబీ 52 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఈ అపురూప ఇన్నింగ్స్ నమోదైంది. చివర్లో కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో విశ్వరూపం చూపాడు. మరోవైపు ఏబీ కళ్లు చెదిరే భారీ షాట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. వరుస బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ గుజరాత్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించాడు.
దీంతో రాయల్ చాలెంజర్స్ 249 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచగలిగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్, గుజరాత్పై 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై యువరాజ్ సింగ్, డారెన్ సామీ, మాజీ భారత క్రికెటర్ శ్రీకాంత్, ఆల్బే మోర్కెల్, హర్భజన్ సింగ్‌తో పాటూ పలువురు క్రికెటర్లు ఏబీ, కోహ్లీల ఇన్నింగ్స్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సంచలన ఇన్నింగ్స్పై విరాట్, డివిల్లీర్స్ ట్విట్టర్లో స్పందించారు.
'నీ బ్యాటింగ్ చూడటం, నీతో కలసి బ్యాటింగ్ చేయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతా'.. అంటూ డివిల్లీర్స్ను ఉద్దేశించి విరాట్ ట్వీట్ చేశాడు. దీనికి ఏబీ స్పందిస్తూ.. 'నా ఫీలింగ్ కూడా అదే, నీవు లెజెండ్'.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్గా రెండో అత్యధికం కావడం విశేషం. ఓ ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీ, ఏబీ చేసిన 229 పరుగుల భాగస్వామ్యం టి-20ల చరిత్రలోనే అత్యుత్తమం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more