SRH's Barinder Sran fined 10 per cent of his match fee for inappropriate behaviour

Srh s barinder sran fined for inappropriate conduct

Barinder Sran, pace bowler, Sunrisers Hyderabad, Sran fined 10% of his match fee, match referee, Sran inappropriate behavior, Sran contrary, Sran spirit of the game, sran ipl code of conduct,

Barinder Sran of Sunrisers Hyderabad was fined 10% of his match fee by the match referee for inappropriate behavior deemed contrary to the spirit of the game.

సన్ రైజర్స్ పేసర్ శ్రాన్ పై ఐపీఎల్ బోర్డు చర్యలు..

Posted: 04/19/2016 06:56 PM IST
Srh s barinder sran fined for inappropriate conduct

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బరిందర్ శ్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో దూకుడు వ్యవహరించిన శ్రాన్ వ్యవహార  శైలిపై ఐపీఎల్ కమిటీ కోరడా ఝళిపించింది. లెవన్ వన్ కోడ్ అఫ్ కండక్ట్ తోసిపుచ్చుతూ వ్యవహారించినందుకు గాను శ్రాన్ పై జరిమానా విధించారు. మైదానంలో ముంబయ్ ఇండియన్స్ బ్యాట్స్ మెన్ తో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై మ్యాచ్‌ రిఫరీ చర్య తీసుకున్నారు.

మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరం (ఆర్టికల్ 2.1.7 ఐపీల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ప్లేయర్స్ అండ్ టీమ్ ఆఫీషియల్స్) కింద అతడిపై చర్య తీసుకున్నారు. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పార్థివ్ (10), బట్లర్ (11), అంబటి రాయుడు(54)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barinder Sran  pace bowler  Sunrisers Hyderabad  ipl code of conduct  

Other Articles