vijay mallya praises virat kohli

I didnt realise i was picking the world best batsman mallya on kohli

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, Shane Watson, Amitabh bachan, Aamir khan, sachin tendulkar, brain lara, salute, Icc world cup T20- 2016,indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Liquor baron and Businessman Vijay Mallya on Monday praised Indian batsman Virat kohli.

కోహ్లీకి అభినందనలు తెలిపిన విజయ్ మాల్యా..

Posted: 03/28/2016 06:07 PM IST
I didnt realise i was picking the world best batsman mallya on kohli

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రజలసోమ్ముతో విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా అసీస్, భారత్ ల మద్య జరిగిన మ్యాచ్ పై స్పందించారు. మాస్టర్ ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి అభినందలు తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ను విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ సమరంగా వర్ణించారు. అంతేకాదు తాను మళ్లీ మళ్లీ తన ట్విట్ లు చేస్తానన్నారు.

టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాలను ట్విటర్ లో పోస్ట్ చేశారు. 'అండర్-19 ఆటగాడిని ఉన్న కోహ్లిని ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి తీసుకున్నప్పుడు మాకు తెలియలేదు... మేము తీసుకున్నది ప్రపంచలోనే బెస్ట్ బ్యాట్స్ మన్ ని అని. కంగ్రాట్స్. ముంబైలో జరగనున్న సెమీఫైనల్ లో ఇద్దరు యోధులు గేల్, కోహ్లి హోరాహోరీగా తలపడనున్నారు. రెండు టీమ్ లకు నా శుభాకాంక్షలు.

ఐపీఎల్ లో తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్న విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, భారత విధ్వంసక బ్యాట్స్ మన్ రానున్న సీజన్ లో సత్తా చాటాల'ని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. ఆదివారం నాగపూర్ లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఉత్కంఠతో వీక్షించానని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  australia  world twenty 20  semi finals  ind vs aus  Team india  cricket  

Other Articles