Asia Cup Final: Disgusting image of MS Dhoni’s severed head goes viral

Distasteful image of taskin holding dhoni s head goes viral

India vs Bangladesh, asia cup final 2016, Ind vs Ban, Asia Cup, Cricket Score, cricket, Mahendra Singh Dhoni, asia cupn 2016, india, uae,Dhoni, india, bangladesh, twenty 20, rohit sharma, shikhar dhawan, virat kohli, Yuvraj Singh, cricket news

Ahead of the showdown, a picture shows Dhoni's severed head being clutched by Bangladeshi bowler Taksin Ahmed.

బంగ్లా వెర్రితలలపై భారత్ అభిమానుల ఆగ్రహం

Posted: 03/06/2016 10:59 AM IST
Distasteful image of taskin holding dhoni s head goes viral

ఆసియా కప్ టోర్నమెంటులో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న టీమిండియా ఇవాళ జరుగనున్న తుది సమరంలో బంగ్లాదేశ్ తో తలపడుతున్న నేపథ్యంలో అక్కడి క్రికెట్ అభిమానుల అభిమానం హద్దులు మీరుతుంది. గతంలో కూడా ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడిన బంగ్లాదేశ్ అభిమానులపై అక్కడి పోలీసుల కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఇలాంటి వెర్రి వేషాలు.. శృతిమించుతున్నాయి అక్కడ వెలసిన పోస్టర్లపై భారత్ లో క్రికెట్ అభిమానుల్లో అగ్రహజ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి.

బంగ్లా అభిమాని ఒకరు పోస్ట్ చేసిన ఫోటో, దానికి వచ్చిన 'షేర్'ల సంఖ్య చూస్తుంటే సగటు భారత క్రికెట్ అభిమాని రక్తం మరిగిపోతోంది. ధోనీ తలను నరికిన ఓ బంగ్లా క్రికెటర్, దాన్ని పట్టుకెళ్తున్నట్టు గ్రాఫిక్స్ తో ఓ చిత్రాన్ని తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై భారత్ అభిమానులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. అలాంటి గ్రాఫిక్స్ తాము అంతకన్నా మెరుగ్గా చేయగలమని, అయితే క్రీడాభిమానం వుంటే సరిపోదని, క్రీడాస్ఫూర్తి కూడా అవసరమని సూచిస్తున్నారు. ఎప్పడు ఓడిపోయే బంగ్లాకు గెలవడం రుచి చూడటంతోనే అక్కడ అభిమానం వెర్రి తలలు వేస్తుందని భారత అభిమానులు చురకలంటిస్తున్నారు.

ఇలా అత్యంత హేయకరమైన చేష్టలు చేయడం బంగ్లా అభిమానులకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ పై పరాజయం తరువాత కూడా ధోనీ సేన అరగుండ్లు చేయించుకున్నట్టు ఫోటోలను మార్ఫింగ్ చేశారు. ఇక నేటి ఫైనల్ లో మోర్తాజా ఆధ్వర్యంలో తమ జట్టు ఇండియాను మట్టి కరిపిస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఎంత వీరాభిమానం ఉన్నా, అది దురాభిమానం కారాదని భారత అభిమానులు ప్రతి ట్వీట్లు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  bangladesh  Mahendra Singh Dhoni  twenty 20  

Other Articles