MS Dhoni responds to ODI retirement query

Ms dhoni responds to odi retirement query

dhoni, MS Dhoni, Team India, Cricket, Dhoni Retirement

It now a common thing to ask Mahendra Singh Dhoni about his retirement and the limited overs skipper’s witty reply was “file a PIL for this”. India does not have any major 50-over commitment for the better part of the 2016, where they would play a lot of T20’s moving upto the World T20 and then would be followed by more than a dozen of Test matches at home under Virat Kohli’s leadership.

టైం వస్తే నేనే తప్పుకుంటా: దోనీ

Posted: 01/24/2016 08:16 PM IST
Ms dhoni responds to odi retirement query

గత కొంత కాలంగా టీమిండియా కూల్ కెప్టెన్ ధోనీ కెప్లెన్సీ నుండి తప్పించాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. టీమిండియాకు దోనీని కాకుండా వేరే వాళ్లను కెప్లెన్ గా నియమించాలని వారు అనుకుంటున్నారు. అయితే దీని గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తన రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ఓ ఉచిత సలహా ఇస్తున్నారు. "నా రిటైర్ మెంటా? కోర్టులో ఓ పిటిషన్ వేసుకోండి" అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో వన్డే టోర్నమెంట్ లు ముగిసిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. పలువురు మాజీ క్రికెటర్లు ధోనీ క్రికెట్ కు పులుస్టాప్ పెట్టే సమయం వచ్చిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, మీడియా ఈ ప్రశ్నను ధోనీ ముందుంచింది.

ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని.. టీమిండియాకు కొత్త కెప్టెన్ రావాల్సింది అంటూ కొంత మంది సీనియర్, మాజీ ఆటగాళ్లు కూడా అంటున్నారు. ఐతే సమయం వచ్చిందని భావిస్తే, తానే తప్పుకుంటానని, ఒకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. తాను నాలుగో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగడానికి తానెప్పుడూ వెనుకాడనని, ఈ స్థానంలో ఆడటం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదని అన్నాడు. ఒక్కోసారి కొద్ది ఓవర్లు మాత్రమే ఆడాల్సి రావచ్చని, మరి కొన్నిసార్లు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి వుంటుందని గుర్తు చేశారు. అయితే తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్న వాళ్లు కావాలంటే కోర్టులో పిల్ దాఖలు చేసుకోవచ్చని ధోనీ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhoni  MS Dhoni  Team India  Cricket  Dhoni Retirement  

Other Articles