Brendon McCullum announces retirement from international cricket

Brendon mccullum to retire from international cricket early in 2016

brendon mccullum, mccullum, brendon mccullum retirement, mccullum retirement, new zealand cricket, cricket new zealand, world cup, nz vs aus, aus vs nz, cricket news, cricket score, cricket"

Brendon McCullum will hang his boots after the second Test against Australia in February next year.

ఫిబ్రవరిలో అన్ని ఫార్మెట్ల క్రికెట్ నుంచి వీడ్కోలు..

Posted: 12/22/2015 07:08 PM IST
Brendon mccullum to retire from international cricket early in 2016

ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఈ వార్త షాకిచ్చేదే. విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరైన న్యూజిలాండ్ మేటి క్రికెటర్, ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ తన అభిమానులకు షాక్ ఇచ్చే సంచలన ప్రకటన చేశాడు. అదేంటంటారా..? త్వరలో అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తన సొంత నగరం క్రైస్ట్ చర్చ్ లో జరగనున్న టెస్టే తనకు చివరి మ్యాచ్ (కెరీర్ లో 101టెస్టు) అని మెక్ కల్లామ్ ప్రకటించాడు.

బౌలర్లకు ముచ్చమటలు పట్టించే బ్యాట్స్మెన్లలో ఒకడైన మెక్ కల్లమ్ 34 ఏళ్లకే రిటటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. బ్రెండన్ సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున అతడి మెరుపు ఇన్నింగ్స్ ను చూడలేం. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి 6273 పరుగులు సాధించి.. అటు 254 వన్డేల్లో 5909 పరుగులు సాధించాడు. టెస్టులో ఓ ట్రిబుల్ సెంచరీని నమోదు చేసిన అతడు, టెస్టుల్లో వంద సిక్స్ లు బాది ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన చేరాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brendon mccullum  retirement  international cricket  Australia  

Other Articles