India vs South Africa, Rain-hit Bangalore Test Called Off Due to Wet Outfield

Second cricket test called off between india and south africa due to rain

AB de Villiers, Bangalore, Bengaluru, Cheteshwar Pujara, Cricket, Dale Steyn, Gurkeerat Singh, Hashim Amla, India, India Vs South Africa, INDvSA, INDvSA Live, IndvsSA, Kohli, live, Live Cricket, Mohali, Murali Vijay, pitch, South Africa, South Africa in India 2015, Sports, SportsTracker, Test match, Vernon Philander, Virat Kohli

The second Test between India and South Africa in Bangalore was washed out for the fourth consecutive day, leaving fans and players frustrated.

ఇండియా VS సౌతాఫ్రికా: వరణుడి అడ్డంకితో బెంగళూరు టెస్టు డ్రా..!

Posted: 11/18/2015 04:01 PM IST
Second cricket test called off between india and south africa due to rain

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు వర్షార్పణమైంది. బెంగళూరులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఐదోరోజైన బుధవారం కూడా ఆట జరగలేదు. ఈ రోజు రెండుసార్లు అవుట్ ఫీల్డ్ను పరిశీలించిన అనంతరం మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

టీ20, వన్డే సిరీస్ లను భారత్ పర్యటనకు వచ్చిన సపారీలీకు కట్టబెట్టిన తరువాత, టెస్టు సిరీస్ లో రాణించి తమ ప్రతిభను నిరూపించుకుందామని ఉవ్విళ్లూరుతున్న టీమిండియాకు రెండో టెస్టులో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలి టెస్టులో కోహ్లీ సేన ప్రయోగించిన స్పీన్ విశ్వరూపానికి తల్లడిల్లిన సపారీలు కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫలితాన్ని విజయంగా అందించారు. రమారమి రెండో టెస్టు కూడా అదే తరహాలో సాగుతుండగా ఎడతెరపి లేని వర్షం మ్యాచ్ భవితవ్యాన్ని శాసించి రద్దు చేసేలా ప్రభావం చూపింది.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజున సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే టీమిండియా కట్టడి చేసింది. ఒక వైపు భారత స్పిన్నర్లు బాగా రాణించడంతో పాటు ఇటు ఓపెనర్లు కూడా రాణించడంతో రెండో టెస్టు తొలి రోజున టీమిండియా పైచేయి సాధించింది. టీమిండియా బౌలర్లు రాణించడంతో సఫారీలు 214 పరుగులకే పరిమితమయ్యారు. తొలి రోజు అట ముగిసే సమయానికి భారత ఎలాంటి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించి పటిష్ట స్థాయికి చేరుకుంది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ 45 పరుగులతో, మరో ఓపెనర్ మురళీ విజయ్ 28 పరుగులతో కొనసాగుతున్నారు, టాస్ గెలిచి తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించిన టీమిండియా మరోసారి స్పిన్ మంత్రంతో అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును వందవ టెస్టు అడుతున్న విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ ఆదుకున్నాడు. 105 బంతుల్లో 85 పరుగులు చేసి గట్టెక్కించాడు. 11 ఫోర్లు, 1 సిక్స్‌తో డివిలియర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏబీ తర్వాత బ్యాట్‌కు దిగిన మిగతా బ్యాట్స్‌మెన్స్ కొద్ది పరుగులకే వికెట్లు సమర్పించుకున్నారు. టీ విరామానికి ముందు డివిలియర్స్ అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిచింది. ఆ తరువాత సౌతాఫ్రికా టెయిల్ ఎండర్స్ ను భారత స్పిన్నర్లు వెనువెంటనే పెవీలియన్ కు పంపారు. 214 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తలో నాలుగు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. పేస్ విభాగంలో వరుణ్ ఆరోన్ ఒక వికెట్ దక్కింది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  bengaluru test  chinaswamy stadium  india  virat kohli  

Other Articles