finally srinivasan dropped from icc chariman post and shashank manohar took that place | icc chairman

Shashank manohar nominated as icc chairman in the place of srinivasan

shashank manohar, n srinivasan, icc chairman, bcci, cricket news

shashank manohar nominated as icc chairman in the place of srinivasan : finally srinivasan dropped from icc chariman post and shashank manohar took that place.

అయ్యయ్యో.. శ్రీని ఆ పదవి నుంచి ఔటాయనే!

Posted: 11/09/2015 01:44 PM IST
Shashank manohar nominated as icc chairman in the place of srinivasan

ఐసీసీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతూ నిన్నటిదాకా భుజాలు తడుముకున్న బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్.. ఇప్పుడు ఆ భుజాలనే కిందకు దించేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే.. ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోయారు. శ్రీని స్థానంలో బీసీసీఐ కొత్త చీఫ్ శశాంక్ మనోహర్ సరికొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఏజీఎం సభ్యులు తీర్మానించారు.

గతంలో బీసీసీఐ చీఫ్ హోదాలోనే కొనసాగుతూ ఐసీసీ ఛైర్మన్ గా శ్రీని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి దిగిపోయిన శ్రీని... ఐసీసీ పీఠంపై నుంచి మాత్రం దిగేందుకు ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో అంతర్గతంగా కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి కూడా. అంతేకాదు.. బీసీసీఐలో ప్రాతినిథ్యం లేకపోయినా.. ఐసీసీ ఛైర్మన్ పదవిలో శ్రీని కొనసాగుతున్నారు. దీంతో దీనిపై దృష్టి సారించిన శశాంక్ మనోహర్.. ముంబైలో మొదలైన సీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీసీసీఐలో ప్రాతినిధ్యంలేని శ్రీనిని ఐసీసీ ఛైర్మన్ గా పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఏజీఎం ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాదు.. ఐసీసీ చైర్మన్ గా శశాంక్ పేరును నామినేట్ చేస్తూ ఏజీఎం సభ్యులు తీర్మానించారు. బీసీసీఐ నిర్ణయంతో శ్రీని దాదాపు క్రికెట్ కు దూరమైనట్టేనని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shashank manohar  n srinivasan  icc chairman  bcci  cricket news  

Other Articles