PCB chief Shaharyar Khan asked to explain India visit by government

Pak govt seeks explanation from pcb on indian misadventure

Cricket, Pakistan Cricket Board, Shaharyar Khan, PCB chairman Shaharyar Khan, BCCI President Shashank Manohar, Federal Minister for Inter-Provincial Coordination, Proposed India-Pakistan cricket series, Mian Riaz Pirzada, bcci, latest Cricket news

The Pakistan Cricket Board (PCB) officials' recent misadventure in India has taken a fresh turn as the Ministry of Inter Provincial Coordination (IPC) has sought an explanation from the board on whether its ill-planned trip was backed and supported by the authorities concerned in Pakistan.

భారత పర్యటనపై పీసీబీ ప్రతినిధులకు నోటీసులు..!

Posted: 11/03/2015 05:31 PM IST
Pak govt seeks explanation from pcb on indian misadventure

భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులపై ఆ దేశ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. దాయాధి దేశ పర్యటనకు ఎలా వెళ్లారని నిలదీసింది. భారత పర్యటనకు ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ సహా ఆయన ప్రతినిధి బృందానికి ఘూటు పదాలతో కూడిన నోటీసులను జారీ చేసింది. షహర్యార్ ఖాన్ నేతృత్వంలో పీసీబీ బృందం రెండు వారాల కిందట ముంబైకి చేరుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ క్రికెట్ సిరీస్ లను పునరుద్ధరించే విషయమై చర్చలు జరిపేందుకు పీసీబీ ఈ పర్యటన చేపట్టింది. అక్కడ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత్ పాక్ సిరీస్ పై చర్చలు జరిపేందుకు పూనుకుంది.

ఇలా సమావేశం ప్రారంభం కాగానే వెంటనే అక్కడికి వచ్చిన శివసేన కార్యకర్తలు.. పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. దీంతో బిసిసిఐతో పీసీబీ ప్రతినిధి బృందం చర్చలు కూడా అర్థంతరంగా ముగిసాయి. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రతినిధులపై పర్యటనపై పాకిస్థాన్ క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మియన్ రియజ్ హుస్సేన్ పిర్జాదా తీవ్రంగా స్పందించారు. భారత పర్యటనకు పీసీబీ బృందం ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. భారత్ పర్యటనకు వెళ్లేప్పుడు పీసీబీ ప్రతినిధులు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? లేదా? వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయన నోటీసులు జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  Pakistan Cricket Board  Shaharyar Khan  bcci  

Other Articles