PCB reprimands Mohammad Amir for regular misconducts in domestic cricket

Pcb warns mohammad amir of repeated misconduct in domestic cricket

mohammad amir, mohammad amir match fixing, match fixing mohammad amir, mohammad amir pakistan, mohammad amir age, mohammad amir news, cricket news, cricket

The PCB chief has not been amused by Mohammad Aamir's behaviour and made himself clear while talking to reporters in Lahore.

అమీర్.. పద్దతి మార్చకోకపోతే జట్టులో స్థానం వుండదు

Posted: 10/17/2015 07:37 PM IST
Pcb warns mohammad amir of repeated misconduct in domestic cricket

పాకిస్థాన్ పేస్ బౌలర్ మహమ్మద్ అమిర్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమీర్ ఇకనైనా నీ పద్దతి మార్చుకో.. లేదంటే నీ అవసరం జట్టుకు లేదని కూడా తెలుసుకో అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్లు ఆమీర్ తమ సహచర క్రికెటర్లపై విరుచుకుపడ్డారని, ఇకపై ఆయన నుంచి మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన సహచర క్రికెటర్ ను దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లో దొంగ అని పిలచినందుకు గాను క్రమశిక్షణా చర్యల కింద మ్యాచ్ ఫీజులోంచి 150 శాతం ఫీజు కోతను విధించారు.

 ఖ్వైదా-ఈ-అజామ్ ట్రోఫీలో భాగంగా గురువారం సుయి సౌత్రన్ గ్యాస్-పీఐఏల మధ్య  మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన  ఫైజల్ ఇక్బాల్, మహ్మద్ అమిర్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది భాగంగా మారిపోయినప్పటికీ  అమిర్ ను దొంగ (చోర్) అంటూ ఇక్బాల్  దూషించాడు. మ్యాచ్ జరుగుతుండగా తొలుత అమిర్ ను ఇక్బాల్ రెచ్చగొట్టారు. దీంతో అమిర్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.  ఇక నియంత్రణ కోల్పోయిన ఫైజల్..   నువ్వు దొంగ అంటూ అమిర్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. తీవ్ర వివాదాన్ని రేపిన ఈ ఘటనలో ఆ క్రికెటర్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు.

2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా అమిర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోని.. ఐసీసీ ఐదేళ్ల నిషేధం పూర్తి కావడంతో దేశవాళీ పోటీల్లో పాల్గొనడానికి క్లియరెన్స్ వచ్చింది.  దీనిలో భాగంగానే అమిర్  సుయి సౌత్రన్ గ్యాస్ జట్టు తరపున బరిలోకి దిగాడు. క్రికెట్ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అమిర్ 2016 వరకూ దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Amir  Thief  pakistan  PCB  

Other Articles