Shashank Manohar likely to be new BCCI president, Srinivasan isolated

Shashank manohar likely to be new bcci president sources

cricket, cricket news, bcci president, sharad pawar, n srinivasan, shashank manohar, bcci president, arun jaitley, arun jaitley jagmohan dalmiya, jagmohan dalmiya arun jaitley, arun jaitley finance minister, sharad pawar, BCCI,N Srinivasan, Anurag Thakur, BCCI, N Srinivasan, Jagmohan Dalmiya, Arun Jaitley, Amitabh Chaudhary

BCCI, former board chief Shashank Manohar has emerged as a consensus candidate for the top job in Indian cricket administration.

బీసీసీఐ కొత్త రథసారధిగా శశాంక్ మనోహర్..?

Posted: 09/26/2015 06:44 PM IST
Shashank manohar likely to be new bcci president sources

ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్, మాజీ ఐసీసీ చీఫ్ శరద్ పవార్ తో జరిపిన మంత్రాంగం ఫలించింది. బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని చేజిక్కించుకునేందుకు వేగంగా పావులు కదిపిన శ్రీనివాసన్ సఫలీకృతుడయ్యారు. ఐపీఎల్ లో అవినీతికి పాల్పడి బీసీసీఐకి దూరంగా ఉండాల్సి రావడం, అదే సమయంలో జగ్ మోహన్ దాల్మియా బీసీసీఐ చీఫ్ గా ఎన్నికవ్వడంతో శ్రీనివాసన్ కు గడ్డుకాలం ఎదురైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పై అనధికార నిషేధం కొనసాగుతోంది. బీసీసీఐ నుంచి శ్రీనివాసన్ కనుమరుగవ్వక తప్పని పరిస్థితుల్లో జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతి కలసి వచ్చింది. దీంతో వేగంగా పావులు కదిపిన శ్రీనివాసన్ ముంబై వెళ్లి శరద్ పవార్ తో మంతనాలు జరిపారు.

ఈశాన్య రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వకూడదని, ఎలాగైనా బీసీసీఐ పీఠం దక్కించుకోవాలని సూచించారు. శ్రీనివాసన్ నిర్వాకం కారణంగా సౌత్ జోన్ కు బీసీసీఐ చీఫ్ పదవిని అధిష్ఠించే అవకాశం లేకపోవడంతో, శరద్ పవార్ వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకుందామని సూచించారు. దీంతో వారిద్దరూ కలిసి శశాంక్ మనోహర్ ను బీసీసీఐ పదవికి నామినేట్ చేసే అవకాశం ఉంది. దీంతో దాల్మియా వర్గానికి చెక్ పెట్టవచ్చని ఆ రెండు వర్గాలు భావిస్తున్నాయి. మరి కాసేపట్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, ఈస్ట్ జోన్ ఏమంటుందో చూడాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  bcci president  sharad pawar  n srinivasan  shashank manohar  bcci president  

Other Articles