A Mumbai Cricketer Rahul Sawant Suffers Heart Attack During Match

Mumbai cricketer rahul sawant suffers heart attack during match teammates rescue

cricketer rahul sawant, rahul sawant suffers heart attack, cricketers suffers on ground, dr hd kanga league, dahisar cricket club, young cricketers, teammate save rahul sawant

Mumbai Cricketer Rahul Sawant Suffers Heart Attack During Match Teammates Rescue : The presence of mind shown by teammates saved the life of a 34-year-old cricketer – Rahul Sawant, of Dahisar Cricket Club – after he suffered a heart attack while playing in Dr HD Kanga League at Azad Maidan.

గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్

Posted: 08/24/2015 06:17 PM IST
Mumbai cricketer rahul sawant suffers heart attack during match teammates rescue

క్రీడారంగానికి చెందిన మైదానాల్లోనే కొందరు ఆటగాళ్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా క్రికెట్ మైదానంలోనే ఎక్కువ సంభవిస్తున్నాయి. ఆమధ్య లూయిస్ ఫిలిప్ తలకు బంతి తగలడంతో మైదానంలో కుప్పకూలగా, ఆ తరహాలోనే ఇండియాలోనూ ఓ ఆటగాడు మైదానంలో స్పృహ కోల్పోగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పుడు తాజాగా ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రాహుల్ సావంత్ అనే ఆటగాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.

‘డాక్టర్ హెచ్.డీ కంగా’ లీగ్ లో సావంత్ దహిసార్ క్రికెట్ క్లబ్ తరపున వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ గా ఆడుతున్నాడు. మైదానంలో క్రికెట్ ఆడుతున్న సందర్భంలో రాహుల్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చేసింది. అతని పరిస్థితి చూసి అక్కడే వున్న సహచరులు వెంటనే బాంబే హాస్పిటల్ కు తరలించారు. ముంబయి క్రికెట్ సంఘంలో వైద్య సదుపాయాలు అక్కడేవీ కనిపించకపోవడంతో వారు వెంటనే సావంత్ ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో తీసుకెళ్లడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం సావంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ‘మరికాస్త ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలియాలి’ అని ఆటగాళ్లంతా భావించినట్లుగా తెలిపారు. దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ తెలిపాడు.

ఈ నేపథ్యంలోనే దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ మాట్లాడుతూ.. ‘సావంత్ నొప్పి భరించలేపోయాడు. ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాగేందుకు నీరు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. కంగా లీగ్ నియమావళి ప్రకారం మ్యాచ్ లు జరిగే ప్రతి మైదానంలోనూ వైద్యులను అందుబాటులో ఉంచాలి. కానీ, వారెక్కడా కనిపించలేదు. అందుకే, ఆలస్యం చేయకుండా బాంబే హాస్పిటల్ కు తీసుకువచ్చాం’ అని తెలిపాడు. సావంత్ కు మద్యం, ధూమపానం వంటి అలవాట్లు లేవని, మంచి వ్యక్తి అని చెప్పాడు. 34 ఏళ్ల సావంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకని వెల్లడించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer rahul sawant  Dr HD Kanga League  

Other Articles