Champions League Twenty20 to be Discontinued

Champions league t20 scrapped with immediate effect

Champions League T20 scrapped with immediate effect, Champions League Twenty20 championship, CLT20, BCCI, Anurag Thakur, cricket, BCCI, Twenty20, Cricket Champions League Twenty20 to be Discontinued, ustice Lodha Committee, CSK, Rajasthan Royals, Supreme Court, latest Cricket news

Just a day after Supreme Court appointed Justice Lodha Committee gave a stinging verdict suspending IPL teams CSK and Rajasthan Royals for two years, cricket authorities on Wednesday decided to scrap the Champions League T20 tournament with immediate effect.

చాంఫియన్స్ లీగ్ టీ20 రద్దు.. తక్షణం అమల్లోకి నిర్ణయం

Posted: 07/15/2015 05:11 PM IST
Champions league t20 scrapped with immediate effect

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తర్వాత, అంతగా ఆకట్టుకుంటున్న ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) టోర్నమెంటు అధికారికంగా రద్దయింది. ఎప్పట్నుంచో రద్దవుతుందని ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం సీఎల్టీ20ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) రద్దు చేస్తూ సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అంతేగాక, ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది' అని భాతర క్రికెట్ నియంత్రంణ మండలి మీడియా అడ్వైజర్ మీడియాకు తెలిపారు.

ఈ టార్నమెంటుకు స్పాన్సర్లు లేకపోవడం కారణంగానే దానిని రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ తెలిపింది. ‘సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బిసిసిఐ, క్రికెట్ సౌతాఫ్రికా(సిఎస్ఏ), క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ)లు సీఎల్టీ రద్దును ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగాల్సిన సీఎల్టీ20 టోర్నీకి ప్రణాళికలు వేయాల్సిన అవసరం లేకుండా పోయింది' అని అడ్వైజర్ చెప్పారు.

సిఎల్టీ20ని 2009లో సిఏ, సిఎస్ఏలతో కలిసి బిసిసిఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాదరణ కోల్పోతున్నందున ఈ టోర్నీని రద్దు చేయాలని సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇండియాలో నిర్వహిస్తున్న ఐపిఎల్, ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్ బాష్ లీగ్, దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న స్లామ్ టీ20ల నుంచి సీఎల్టీ20కి పోటీ ఎదురవుతోందన్నారు. ఆటగాళ్లకు మంచి అవకాశంగా ఉన్న సీఎల్టీ20కి అభిమానుల నుంచి తగిన ఆదరణ లభించడం లేదని అన్నారు.

తమ వాణిజ్య భాగస్వాములందర్నీ సంప్రదించిన తర్వాతే సీఎల్టీ20 రద్దుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రద్దుకు సంబంధించిన ఇతర వ్యవహారాలు తర్వలోనే ముగించడం జరుగుతుందని తెలిపారు. స్పాన్సర్లు లేకుండా ఈ టోర్నిని నిర్వహించడం కష్టమని అభిప్రాయపడిన బోర్డు, ఈ మేరకు ఈ టోర్నీని రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. సీఎల్ టీ20 స్థానంలో ఐపీఎల్ లోని టాప్ 4 జట్లతో మిని ఐపీఎల్ నిర్వహిచాలని బిసిసిఐ బావిస్తున్నట్లు సమాచారం. బేబి ఐపిఎల్ పేరుతో టోర్నిని నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా వున్నట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CLT20  BCCI  Anurag Thakur  cricket  BCCI  

Other Articles