I was never involved in wrongdoing, says Suresh Raina on Lalit Modi's allegations

Raina rubbishes modi s betting allegations mulls legal action

Raina rubbishes Modi's betting allegations, mulls legal action, Lalit Modi, Suresh Raina, Bribery, Match-fixing, spot-fixing, International Cricket Council (ICC), Board of Control for Cricket in India (BCCI), Dave Richardson

Rejecting Lalit Modi's allegations that he accepted bribes from a businessman, Indian cricketer Suresh Raina today said he is considering legal action against the former IPL Commissioner and insisted that he was never involved in any wrongdoing.

భెట్టింగ్ వార్తలను తోసిపుచ్చిన రైనా

Posted: 07/02/2015 08:06 PM IST
Raina rubbishes modi s betting allegations mulls legal action

ఐపీఎల్ లో ఆర్థిక నేరాలకు, నిధుల మళ్లింపులకు పాల్పడి దేశీయ విచారణ సంస్థల నుంచి తప్పించుకుని లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీ.. రాజకీయ నేతలతో పాటు క్రికెటర్లపై కురిపించిన ఆరోపణలపై ఒక క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. రోజుకోకరిపై అరోపణలు గుప్పిస్తూ.. తాను ఏదో నీతిమంతుడిని అన్న విధంగా వ్యవహరిస్తున్న మోడీని క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కాగా లలిత్ మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన బిసిసిఐ, ఐసిసిలు ఆయన ఆరోపించినట్లు ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేయడంతో.. అంతా సద్దుమణిగింది.

కాగా, మోదీ తనపై చేసిన ఆరోపణల పట్ల రైనా స్పందించాడు. ఎప్పుడూ తప్పు చేయలేదని, తనపై ఆరోపణలు చేసిన లలిత్ మోడీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయమై అలోచిస్తున్నాని చెప్పాడు. సరైన క్రీడాస్పూర్తితోనే క్రికెట్ ఆడానని, ఈ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని కోరాడు. ఇప్పటి రవకు ఎలాంటి అనైతిక చర్యల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టం చేశాడు. ఏ జట్టుకు అడినా.. తనకు ప్రాణప్రదమైన క్రికెట్ ను అంతే నిజాయితీగా ఆడానని రైనా చెప్పుకోచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modigate  suresh raina  cricketer  lalit modi  

Other Articles