Shahrukh Khan Team Kolkata Knight Riders Won Match Against Chennai Super Kings

Kolkata knight riders won match against chennai super kings eden gardens

Kolkata Knight Riders, Chennai Super Kings, Eden Gardens, Kolkata Knight Riders Team Members, Chennai Super Kings Team Members, Shahrukh Khan, Gautam Gambhir, Mahendra Singh Dhoni, Robin Uthappa, Andrew Russel

Kolkata Knight Riders Won Match Against Chennai Super Kings Eden Gardens : Kolkata Knight Riders Team Takes Revenge On Chennai Super Kings By Winning The Match At Eden Gardens.

చెన్నై మీద పగ తీర్చుకున్న కోల్ కతా!

Posted: 05/01/2015 11:09 AM IST
Kolkata knight riders won match against chennai super kings eden gardens

ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు మొదటిసారి తలబడినప్పుడు ధోనీసేన భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. లక్ష్యఛేదన తక్కువగా వున్నప్పటికీ చెన్నై బౌలర్ల ధాటికి కోల్ కతా ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఎంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ను కోల్ కతా చేజార్చుకుంది. అంతే! అప్పటినుంచి ఆ జట్టు మీద కసి పెంచుకున్న కోల్ కతా జట్టు.. నిన్న (గురువారం) మ్యాచ్ సందర్భంగా తన పగను తనివితీరా తీర్చుకుంది.

గురువారం రాత్రి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా జట్టు చెన్నై మీద అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన గంభీర్.. ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు మొదట్లో తడబడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెటన్లు తక్కువ స్కోరు చేసి టపీటపీమని వెనువెంటనే పవేలియన్ చేరారు. మెక్ కలమ్ (32) ఓ ఊపు ఊపేసి పవెలియన్ చేరగా.. రైనా (8), డుప్లెసిస్ (20), బ్రావో (20) స్కోరు బోర్డును కదిలించేందుకు ప్రయత్నించారు. ధోనీ (1) నిరాశపరచగా.. జడేజా (24) నేగి (27)తో కలిసి తమ జట్టును ముందుకు తీసుకెళ్తేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో బ్రాడ్ హాగ్ 4 వికెట్లు, ఆండ్ర రస్సల్ 2 వికెట్లు, యాదవ్, చావ్లాలు చెరో వికెట్ తీసుకున్నారు.

ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టు.. ముందునుంచే మంచి ప్రదర్శన కనబరుస్తూ దూసుకెళ్లింది. ముఖ్యంగా రాబిన్ ఊతప్ప (58 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 80) తన అద్భుతమైన ఆటతో మైదానాన్ని పరుగుల వర్షంతో నింపేయడంతో.. ప్రేక్షకులు కేకలతో మారుమోగించేశారు. ఇతనికి తోడు ఆండ్రీ రస్సెల్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 52) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించడంతో.. ఒక్క బంతి మిగిలుండగానే కోల్ కతా విజయభేరి మోగించింది. జట్టు విజయానికి దోహదపడ్డ ఆండ్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata Knight Riders  Chennai Super Kings  Robin Uthappa  

Other Articles