every bowler should win captains confidence first says ashish nehra

Always good to have captain on your side ashish nehra

Indian Premier League (IPL) 2015, IPL-2015, IPL-8, ipl season 8, Ashish Nehra, M.S. Dhoni, chennai super kings, mumbai Indians, captains confidence

always good to have captain on your side says ashish nehra, and every bowler should win captains confidence first

బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని చూరగొనాలి

Posted: 04/18/2015 08:23 PM IST
Always good to have captain on your side ashish nehra

జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు కెప్టెన్ నమ్మకాన్ని కల్గి ఉండాలని ఆశిష్ నెహ్రా అన్నాడు. ఐపీఎల్ -8 భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కింగ్స్ విజయం సాధించిన నేపథ్యంలో నెహ్రా స్పందించాడు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనపై నమ్మకం ఉంచడంతోనే మూడు వికెట్లు తీశానని నెహ్రా ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. తాను ఇప్పటివరూ ట్వంటీ 20 ల్లో గానీ, వన్డేల్లో గానీ మూడు స్పెల్ ల్లో బౌలింగ్ చేశానని.. అది ఆరంభ ఓవర్లు కావచ్చు.. చివరి ఓవర్లు కావచ్చునని.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగిందని చెప్పుకోచ్చాడు.

తమ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీకి తనపై నమ్మకం వుండటంతోనే 15 ఓవర్ ను తనకు అప్పచెప్పాడన్నాడు. అంతతొందరగా తనకు బౌలింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అనే ఆలోచనలో తాను పడిపోయానన్నాడు. ఆట ముందుకు వెళుతుంది. మనం వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. చివరి నాలుగైదు ఓవర్లలో 80-90 పరుగులు వచ్చే అవకాశం ఉంది.  పరుగులను నియంత్రించాలి' అని ధోనీ తనతో చెప్పినట్లు నెహ్రా తెలిపాడు. మొత్తంగా నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసిన తాను మూడు వికెట్లు తీసి ముంబై పరుగుల ప్రవహాన్ని కట్టడి చేయడానికి కెప్టెన్ నమ్మకమే కారణమన్నాడు నెహ్రా.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8 2015  Ashish Nehra  M.S. Dhoni  chennai super kings  

Other Articles