IPL 8: Sachin Tendulkar's words of advice for Rohit Sharma, Virat Kohli

Sachin tendulkar advises rohit sharma virat kohli for ipl 8

Sachin Tendulkar advises Rohit Sharma, Sachin Tendulkar advises Virat Kohli, Sachin Tendulkar's words of advice for IPL 8, Indian Star batsman virat kohli, Indian opener Rohit sharma, Indian batting legend sachin tendulkar, Royal Challengers Bangalore IPL 8, Indian Premier league 2015, IPL season 8, Mumbai Indians, Eden Gardens, Royal Challengers Bangalore

Cricket legend Sachin Tendulkar on Tuesday was the cynosure of all eyes as the Mumbai Indians (MI) icon spent time with his boys ahead of the Indian Premier League (IPL) opener against defending champions Kolkata Knight Riders (KKR) at the Eden Garden here on Wednesday.

రోహిత్, కోహ్లీకి సచిన్ క్లాస్.. ఐఫీఎల్ పై సూచనలు

Posted: 04/08/2015 06:41 PM IST
Sachin tendulkar advises rohit sharma virat kohli for ipl 8

భారతీయ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్లాస్ తీసుకున్నాడట. ఎక్కడా..? ఎవరికీ..?  ఇవేగా మీ ప్రశ్నలు. ఏ కాలేజీలోనో కాదండి క్రికెట్ మైదానంలోనే అందునా.. ఈడెన్ గార్డెన్స్ లోనే ఈ క్లాస్ జరిగింది. అదీనూ తాను ముందు ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు క్లాస్ తీసుకున్నాడట. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మరో స్టార్ బ్యాట్స్ మెన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా కొద్దిగా క్లాస్ వినే బాగ్యం కలిగిందట. రోహత్ శర్మకు సచిన్ బ్యాటింగ్ మెలకువలు నేర్పించారు. ముంబై ఇండియన్స్ జెర్సీలోనే మైదానానికి వచ్చిన సచిన్ టెండూల్కర్, ప్రాక్టీస్ సెషన్ సాగిన రెండు గంటల పాటు అక్కడే ఉన్నాడు. జట్టు సభ్యులందరితో మాట్లాడుతూ మార్గనిర్దేశం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ సందర్భంగా కోల్ కతాపై తొలి మ్యాచ్‌లో జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై  ముంబై ఇండియన్స్ కోచ్ పాంటింగ్, కెప్టెన్ రోహిత్ శర్మలతో చర్చించాడు. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఐపీఎల్ మొదలైననాటినుంచి సచిన్ ముంబై జట్టులో భాగమే. ఇకపై కూడా ఉంటాడు. మాకు సచిన్ అవసరం ఎప్పుడు ఉన్నా, సహకరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు' అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆ సమయంలో బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్కడకు రావడంతో ఆయనతో కూడా సచిన్ చర్చించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Virat Kohli  Rohit Sharma IPL 8  

Other Articles