India cricket team members major problems india vs england match

india vs england match, india tri series tour, india cricket team, indian cricketers, india cricket team members, 2015 world cup, icc world cup 2015, india vs australia match

india cricket team members major problems india vs england match : indian cricketers facing five major problems during 2015 tri series.

టీమిండియాకు శాపంగా మారిన 5 సమస్యలు...

Posted: 01/29/2015 01:04 PM IST
India cricket team members major problems india vs england match

ముక్కోణపు సిరీస్’లో భాగంగా టీమిండియా ప్రదర్శించిన తీరు అందరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో అయితే స్టార్ బ్యాట్స్’మెన్లు వున్నప్పటికీ అత్యంత దారుణమైన పేలవ పెర్ఫార్మెన్ తో పవెలియన్ చేరడం తప్ప మరేం చేయలేకపోయారు. బౌలింగ్ కాస్తోకూస్తో రాణించగలిగారు. ఏదైతేనేం.. ఈ ముక్కోణపు సిరీస్’లో ప్రస్తుతం ఇండియా ప్రమాదపుటంచుల్లో వుంది.

గురువారం ఇంగ్లాండ్’తో తలపడనున్న భారత్.. ఖచ్చితంగా ఆ మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్’కు చేరుతుంది. లేకపోతే తట్టాబుట్టా సర్దేసుకుని వెనక్కు రావాల్సిందే! ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్’లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని వుండగా.. దాంతో తలపడేందుకు ఇంగ్లాండ్, భారత్ పోటీ పడుతున్నాయి. అయితే.. ఇలాంటి సందర్భాల్లో టీమిండియా 5 సమస్యలు శాపంగా మారి వేధిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా.. వాటి నుంచి ఇండియా బయటపడలేకపోతోంది. అవేమిటో తెలుసుకుందామా...

1. ఓపెనింగ్ సమస్య : ఓపెనింగ్’లో వచ్చిన శిఖర్ ధావన్ పేలవ పెర్ఫార్మెన్స్’తో తలనొప్పిగా మారితే.. మరో ఓపెనర్ రోహిత్ మంచి ఫామ్ వుంటే అతడిని గాయాలు వదలడం లేదు. దీంతో ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన రహానె బాగానే ప్రదర్శిస్తున్నాడు కానీ.. ధావన్ మాత్రం శూన్యం. అతడు ఫామ్’లోకి వస్తేనే భారీ స్కోరు చేసే వీలుంటుంది.

2. కోహ్లీది ఏ స్థానం : ధోనీ చేస్తున్న ప్రయోగాలకు కోహ్లీ బలికాక తప్పడం లేదు. అతడు మూడో నెంబరులో దిగుతాడా..? లేక నాగులో నెంబరులోనా..? అన్నది స్పష్టం కావడం లేదు. ఆ స్పష్టత లేకపోవడం వల్ల కోహ్లీ మ్యాచ్’పై దృష్టి సారించలేకపోతున్నాడు. మరి.. ఈ వన్డేలో ఏమవుతుందో చూడాలి?

3. బౌలింగ్ : స్పిన్నర్లు తమ ప్రతిభను బాగానే కనబరుస్తున్నారు. స్టువర్ట్ బిన్నీ, అక్షరపటేల్, రవీంద్రజడేజా, అశ్విన్ లాంటి స్పినర్లు బాగానే రాణిస్తున్నారు. కానీ పేసర్ల సంగతే అంతుచిక్కడం లేదు. అసలు పేర్లు ఎవరనే అవగాహన ఇంతవరకు రాలేదంటే.. ఇండియా ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలుసుకోవచ్చు.

4. గాయాలు : మంచి ఫామ్’లో వున్న ఆటగాళ్లకు గాయాలు వెంటాడుతూనే వున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మని అయితే ఇవి పట్టిపీడుస్తున్నాయి. మరోవైపు.. వరల్డ్ కప్’లో స్థానం సాధించిన జడేజా, ఇషాంద్, భువనేశ్వర్’లు బెడ్ మీదే వున్నారు. దీంతో భారత్ పెర్ఫార్మెన్ కాస్త తగ్గింది.

5. అలసట : గ్యాప్ లేకుండ ఇండియా జట్టు వరుసగా మ్యాచ్’లు ఆడుతుండటంతో ఆటగాళ్లందరూ అలసటగా ఫీలవుతున్నారు. 1992లో ఇదే తరహాలో భారత్ బరిలోకి దిగి ఓటమి చవిచూసింది. ఇప్పుడు 2015 ఫిబ్రవరిలో గ్యాప్ లేకుండా టోర్నీలు ఆడి.. నేరుగా వరల్డ్ కప్ ఆడబోతోంది. మరి.. ఈసారి ఏమవుతుందో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team members  2015 india tri series  icc world cup 2015  

Other Articles