Mudgal committee report gives clean chit to srinivasan in ipl match fixing to supreme court

Mudgal committee report, Mudgal committee news, Mudgal committee investigation, ipl sport fixing, ipl match fixing, n srinivasan, Mudgal committee n srinivasan, Mudgal committee ipl match fixing, Meiyappan match-fixing

Mudgal committee report gives clean chit to Srinivasan in ipl match fixing to supreme court

ఫిక్సింగ్ స్కాంలో శ్రీనివాసన్ పాత్రపై కమిటీ క్లీన్ చీట్!

Posted: 11/17/2014 05:08 PM IST
Mudgal committee report gives clean chit to srinivasan in ipl match fixing to supreme court

2013లో ఐపీఎల్-6 సీజన్ లో ఫిక్సింగ్ స్కామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే! ఫిక్సింగ్ కు పాల్పడిన కొందరు ఆటగాళ్లపై అప్పటికప్పుడే బహిష్కరణ వేటు వేయగా... ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రేమయముందా..? అనే కోణంలో ముద్గల్ కమిటీ విచారణను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొందరు క్రికెట్ ఆటగాళ్లు, ప్రముఖుల పేర్లతోబాటు ఐసీసీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ సహా యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్లు బయటకొచ్చాయి. ఎవరిపేర్లయితే వెల్లడయ్యాయో వారితో కమిటీ ప్రశ్నోత్తరాలు జరిపి, అందులో భాగంగా పూర్తి వివరాలను సేకరించింది. రకరకాలుగా తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టిన కమిటీ.. తాజాగా అందుకు సంబంధించి కొన్ని వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీనివాసన్ ప్రమేయం లేదని ఆ ముద్గల్ కమిటీ సుప్రీంకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే శ్రీనివాసన్ అల్లుడైన గురునాథ్ మెయ్యప్పన్ గురించి ప్రస్తావిస్తూ... ఆయన ఒక హోటల్ లో బుకీని కలిసినట్టు తెలిపింది. కానీ.. అతడు బెట్టింగ్ లో పాల్గొన్నాడని చెప్పేందుకు తమ దగ్గర సరియైన సాక్ష్యాలు లేవని వివరించింది. ఇక ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్, రాజస్తాన్ టీం సహయజమాని రాజ్ కుంద్రాలు కూడా బుకీలతో టచ్ లో ఉండేవారని తమ దర్యాప్తులో వెల్లడైందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇంకా ఇతరత్ర విషయాలను దర్యాప్తు చేయవలసి వుందని ఆ కమిటీ తెలిపింది.

ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీం... కేసు విచారణను ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది. ఆ రోజు ఫిక్సింగ్ స్కామ్ లో వున్న నిందితులంద హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు.. సుప్రీం ఇచ్చిన గడువు తేదీలోపు కమిటీ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్కామ్ నుంచి శ్రీనివాసన్ మేనల్లుడు కూడా తప్పించుకుంటాడా..? లేదా..? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరి సుప్రీం 24వ తేదీన ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudgal committee report  n srinivasan  ipl match fixing  Meiyappan  telugu news  

Other Articles