Indian cricket team captain mahendra singh dhoni got 5th rank in forbs worlds most valuable brand athlete

mahendra singh dhoni, captain mahendra singh dhoni news, indian cricket captain mahendra singh dhoni, forbs magazine, forbs magazine survery, forbs worlds most valuable brand athlete, tennis star federer, indian sports persons, world sports atheltes

indian cricket team captain mahendra singh dhoni got 5th rank in forbs worlds most valuable brand athlete

డబ్బులు దోచుకోవడంలో రికార్డు తిరగరాసిన ధోనీ!

Posted: 10/09/2014 03:05 PM IST
Indian cricket team captain mahendra singh dhoni got 5th rank in forbs worlds most valuable brand athlete

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి అటుంచితే.. తాజాగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఏవిధంగా అయితే ఈ ఆటగాడు తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులను నమోదు చేసుకుని ధనాధన్ ధోనీగా పేరు సంపాదించుకున్నాడో... అదేవిధంగా చాలా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ డబ్బులను దోచుకోవడంలో ప్రపంచంలోనే తనదైన రికార్డును తిరగరాసేశాడు. ఇంతకీ ఇక్కడ చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. యావత్తు భారత్ లో వున్న ఎందరో ప్రముఖులు వున్నప్పటికీ.. వాళ్లందరినీ తలదన్నేసి ఎక్కువ డబ్బులు దోచుకునే జాబితాలో కేవలం ధోనీ ఒక్కడే నిలిచాడు.

అసలు విషయం ఏమిటంటే.. ఫోర్బ్స్ ‘‘ప్రపంచ అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్’’ అనే పేరిట ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. కొన్ని ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వారిలో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారనేది అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చేసిన సర్వేలో ఈ ‘‘ప్రపంచ అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్’’ జాబితాలో కెప్టెన్ ధోనీ కూడా నిలిచాడు. మొత్తం పదిమంది అథ్లెట్ల జాబితాలో 20 మిలియన్ల అమెరికన్ డాలర్లతో ఈ ధనాధన్ క్రికెటర్ ఐదవ ర్యాంకులో వున్నాడు. ఇతర సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న వారందరినీ తలదన్నేసి.. ఈ జాబితాలో కేవలం ధోనీ ఒక్కడే స్థానం కల్పించుకోవడం విశేషంగా నిలిచింది.

2013వ సంవత్సరంలో బ్యాట్ స్పాన్సర్షిప్స్ స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ విశ్వవిద్యాలయంకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ధోనీ.. ప్రతిఏటా నాలుగు మిలియన్ల డాలర్లను తన ఖాతాలో జమ చేసుకున్నాడని ఫోర్స్బ్ తన సర్వే ద్వారా వెల్లడించింది. అంతేకాదు.. గతంలో రీబాక్ సంస్థ ప్రచారకర్తగా వున్న సమయంలో ఇతగాడు ఒక మిలియన్ డాలర్లను పుచ్చుకున్నట్లు తెలిపింది. ఇలా ఈ విధంగా అనేక సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మనోడు బాగానే డబ్బులు దోచేసుకున్నాడు. మరోవైపు ఈ జాబితాలో అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రోన్ జేమ్స్ మొదటి స్థానంలో నిలవగా.. అతని తర్వాతి స్థానాల్లో గోల్ఫర్ టైగర్ ఉడ్స్, టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్ నిలిచారు. ఏదేమైనా.. ధోనీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా తనదైన ప్రత్యేక ఇమేజీతో సత్తా చాటేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles