Champions league t20 starts with chennai super kings and kolkata knight riders match

kolkata knight riders, chennai super kings, mahendra singh dhoni, gautam gambhir, kolkata knight riders team players, chennai super kings team players, champions t20 league

champions league t20 starts with chennai super kings and kolkata knight riders match

ధోనీ, గంభీర్ యుద్ధంతో ఛాంపియన్స్ కు శ్రీకారం!

Posted: 09/17/2014 02:45 PM IST
Champions league t20 starts with chennai super kings and kolkata knight riders match

బుధవారం (17-09-2014) నుంచి ప్రారంభం అవుతున్న ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా.. హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తోనే ఈఏడాది తొలి సీఎల్టీ టోర్నీ ప్రారంభం కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ పై నగరవాసులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇద్దరి జట్లలోనూ కావలసినంతమంది స్టార్ ఆటగాళ్లు, అనుభవం వున్న యువతరంతో పరస్పరం తలపబడుతున్న ధోనీ, గంభీర్ సేనల మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం కొనసాగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈసారి కోల్ కతాకు గాయాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. క్రిస్ లిన్, మోర్నీ మోర్కెల్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ బోర్డు నిరభ్యంతర పత్రం ఇవ్వనికారణంగా షకీబ్ అల్ హసన్ కూడా ఆడటం లేదు. దీంతో గంభీర్ సారధ్యంలోనే వున్న యూసుఫ్ పఠాన్, ఉతప్ప, మనీష్ పాండే లాంటి ఆటగాళ్లమీదే మొత్తం టీం ఆధారపడి వుంది. ఇక బౌలింగ్ లో కలిస్, టెన్ డస్కటే, పేసర్ కమ్మిన్స్‌తో పాటు అత్యంత కీలకమైన సునీల్ నరైన్ లు వున్నారు.

గంభీర్ జట్టుకు ధీటుగానే ధోనీ జట్టు కూడా వుంది. గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈసారి ఇందులో తిరిగి వచ్చేశాడు. మెకల్లమ్, డు ప్లెసిస్, డ్వేన్ స్మిత్‌లతో ముగ్గురు నాణ్యమైన విదేశీ బ్యాట్స్‌మెన్ లతోబాటు.. రైనా, ధోనిల రూపంలో ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆల్‌రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యత తీసుకుంటారు. ఇక పేసర్లుగా ఈశ్వర్ పాండే, మోహిత్ శర్మ, నెహ్రా తుది జట్టులో ఉండొచ్చు. మొత్తం మీద చెన్నై జట్టు బాగా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ జట్ల మధ్య సాగనున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారోనన్న సందేహం రసవత్తరంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles