Lost the ovel test match and series against england

indian england test series, india cricket team, india ovel test match, india vs england, india cricket team in enland tour, mahendra singh dhoni, sunil gavaskar tweet, indian cricket team fans, indian cricket team players

Indian cricket team lost the Ovel test match and series against england : Indian cricket team lost the final Ovel test match with 244 runs against england team so that the test series also lost.

‘‘టెస్టులు చేతకాకపోతే.. వన్డేలు ఆడుకోండి’’!

Posted: 08/18/2014 10:43 AM IST
Lost the ovel test match and series against england

ధోనీసేన మళ్లీ పరాజయం పాలయ్యింది. గతంలో జరిగిన మ్యాచులకంటే ఈసారి దారుణంగా ఓటమి చవిచూసింది. గెలుపు మనదే అంటూ డప్పు కొట్టుకున్న మన ఆటగాళ్లు యావత్తు భారతదేశ గౌరవాన్ని ఇంగ్లాండ్ గడపలో మంటగలిపేశారు. ఓవల్ టెస్టులో మన భారత క్రికెట్ జట్టు చాలాఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టుది ఇంకా రెండో ఇన్నింగ్స్ మిగిలివుండగానే మన భారత్ జట్టు ముందుగానే చాప చుట్టేసింది. ఏకంగా 244 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో టెస్ట్ సిరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లాండ్ కౌవసం చేసుకుంది. లార్డ్స్ గ్రౌండ్స్ లో 28ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాసిన మన భారత్... దానిని ఒక్కసారిగానే చెరిపేసుకుంది. ధోనీ గెలిపిస్తాడంటూ ఎంతోమంది వుంచుకున్న నమ్మకాన్ని అతను వొమ్ము చేసేశాడు. భారత్ ను టాప్ లో నిలబెడతాడని అనుకుంటే.. ఇప్పుడు సిగ్గుతో అందరూ తలదించుకునేలా చేసేశాడు అంటూ ఎటుచూసినా తూట్లు పొడిచేలా విమర్శల బాణాలు విసురుతున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన మన భారత క్రికెటర్లు భారీస్కోరువైపుకు దూసుకుపోతారనుకున్న తరుణంలో మొదట్లో ఓపెనర్లు రెండు ఓవర్ల వరకు అద్భుత బ్యాటింగ్ ను ప్రదర్శించి.. చివరికి టపీటపీమంటూ ఒకరివెనకాల మరొకరు వరుసగా ఔట్ అవుతూ పవేలియన్ చేరిపోయారు. ధోనీ మినహా మిగతా ఆటగాళ్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతెందుకు.. బౌలర్ ఇషాంత్ శర్మ ప్రదర్శించిన మంచి తీరును కూడా వారు అందుకోలేకపోయారు. దీంతో మొత్తం తొలిఇన్నింగ్స్ లో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. మంచి బ్యాట్స్ మెన్స్ వున్నప్పటికీ భారత్ భారీ స్కోరును అందుకోలేకపోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. అందరూ తమతమ ప్రతిభమేరకు బాగానే వేశారుగానీ.. వికెట్లు తీసుకోవడంలో కాస్త విఫలమయ్యారనే చెప్పుకోవాలి. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 486 పరుగులు సాధించి పెద్ద ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడే అర్థమైపోయింది... భారత్ చాప చుట్టేసుకుంటుందని!

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మన భారత్.. మొదటి ఇన్నింగ్స్ కంటే చాలా దారుణంగా ఆడింది. ఎంత దారుణంగా అంటే.. కేవలం 94 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్స్ లో స్టువర్ట్ బిన్నీ 25 పరుగులు, విరాట్ కోహ్లి 20, పుజారా 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక మిగతా ఆటగాళ్లు కనీసం రెండేసి పరుగులను కూడా అందుకోలేకపోయారు. ఇక కెప్టెన్ ధోనీ మాత్రం ఏం చేస్తాడు.. అతను కూడా తన జట్టు ఆటగాళ్లులాగే పవేలియన్ చేరిపోయే కూర్చుండిపోయాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్ కు ఇంకా ఒక ఇన్నింగ్స్ మిగిలివుండగానే ఘోరంగా ఓటమి పాలైంది. భారత్ ఇలా పరాజయం అవడం ఆలస్యం.. మన దిగ్గజ ఆటగాళ్లందరూ తీవ్రంగా విమర్వలు చేయడం మొదలుపెట్టేవారు. క్రికెట్ ఆడటానికి చేతకానప్పుడు అసలు మీరు క్రికెట్ రంగంలో ఎందుకు అడుగులు వేశారంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆవేదనలు వెల్లువెత్తారు.

‘‘టెస్టుల్లో ఆడాలని లేకపోతే వదిలేయండి.. వన్డేలు ఆడుకోండి..! అంతేకానీ ఇటువంటి ఆటతో దేశాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దు’’ అంటూ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరిస్తూ మరీ విమర్శలు చేశారు. అలాగే.. ‘‘విదేశాల్లో క్రమం తప్పకుండా విజయాలు సాధించే సామర్థ్యం, సత్తా మన భారత జట్టులు లేదు. ఏదో ఒక మ్యాచ్ తో రికార్డులు సృష్టించినంత మాత్రాన గెలుపు మనదే అనుకుంటే చాలా పొరపాటు.. ఐదు టెస్టుల మ్యాచు కాబట్టి అన్నింటిలోను మంచి ప్రతిభను ప్రదర్శస్తేనే విజయం వరిస్తుంది. ఇప్పుడు మనకు ఇందులో భారత్ లో వున్న లోపాలేంటో స్పష్టంగా అర్థమయ్యాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థులు సునాయాసంగా విజయాన్ని అందుకునే అవకాశాన్ని పుంజుకుంది. స్వదేశంలో గెలిచి డప్పులు గెలుచుకోవడం కాదు. విదేశాల్లో కూడా అదే ప్రతిభను ప్రదర్శించాలి. తప్పులు మీద తప్పులు చేయడం తప్ప.. ఆ తప్పులను సరిదిద్దుకునే అంశాలను మాత్రం నేర్చుకోవడం లేదు. చేసిన తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూనే వున్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక అభిమానులు కూడా ఈ కోవలోనే ఆవేదనలు వెల్లువెత్తుతూ.. ‘‘మీకో దండం’’ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles