Mumbai indians to the playoffs

Mumbai Indians enter playoffs, mumbai indians, rajasthan royals, corey anderson, sanju samson, ambati rayudu, kieron pollard

Corey Anderson made an unbeaten 95 off 44 balls while Aditya Tare hit a crucial six to chase down 189 in 14.4 overs and pip Rajasthan by net run rate

అండర్ సన్ వండర్ ఇన్నింగ్స్

Posted: 05/26/2014 11:05 AM IST
Mumbai indians to the playoffs

పొట్టి ఫార్మాట్ టి20 క్రికెట్ లో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదేమో... ఈ టి20 క్రికెట్‌ లో అసాధ్యాల్ని సుసాధ్యం చేసి చూపిస్తారు. ఇప్పడు అదే జరిగింది. ఇప్పటి వరకు ఈసీజన్ ఐపీఎల్ టోర్నీలో అంతంత మాత్రంగానే ఆడుతూ వచ్చిన డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి చేరుకోవడం కష్టమే అనుకున్నారు. కానీ తనకు మిగిలిన చివరి మ్యాచ్ లో అద్బుతంగా ఆడి అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ రాజస్థాన్ పై విజయం సాధించి, ప్లే ఆఫ్ కి  అర్హత సాధించింది.

ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే 14.3 ఓవర్లలో 190 భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉన్నా, అనుకున్న లక్ష్యాన్నికాస్తా పిడుగుల్లాంటి షాట్లతో 14.4 ఓవర్లలో చేధించింది. ముంబై సంబరాలకు కారణం ఒక్కడు. అతడే ఆండర్ సన్. క్రికెట్ చరిత్రలో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు స్రుష్టించిన ఇతగాడు ఈ సీజన్లో పెద్దగా మెరిసింది ఏమీ లేదు. చివరి మ్యాచ్ లో చిచ్చర పిడుగులా కోరె అండర్సన్ (44 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) లీగ్‌లో తొలిసారిగా విశ్వరూపం ప్రదర్శించాడు.

తనకు అచ్చొచ్చిన వాంఖడేలో ముంబై రాజస్థాన్ తో తలపడిన  ఈ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠతో సాగింది. . ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (47 బంతుల్లో 74; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), కరుణ్ నాయర్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై 14.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 195 పరుగులు చేసి నెగ్గింది.  హస్సీ (11 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఆకట్టుకోగా చివర్లో అంబటి రాయుడు (10 బంతుల్లో 30; 5 ఫోర్లు; 1 సిక్స్) జట్టుకు ఉపయోగపడ్డాడు. కులకర్ణి, కూపర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండర్సన్‌కు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles