Rcb to eight wicket win over dd

Virat Kohli, Yuvraj Singh, Delhi Daredevils, Chris Gayle, Indian Premier League, Dinesh Karthik, Live Cricket score, IPL 2014, ipl2014news

Yuvraj Singh scored an unbeaten 52 while Virat Kohli remained unbeaten on 49 as Royal Challengers Bangalore crushed Delhi Daredevils by eight wickets in their opening IPL 7 game in Sharjah on Thursday.

ఐపీఎల్ 7లో బెంగుళూరు బోణి కొట్టింది

Posted: 04/18/2014 10:03 AM IST
Rcb to eight wicket win over dd

ఐపీఎల్ సీజన్ 7లో ఉన్న బలమైన జట్లలో రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు ఒకటి. ఈ జట్టు ఈ సీజన్ లో తొలి లీగ్ మ్యాచ్ ఢిల్లీతో తలపడి తన బలానికి తగ్గ ప్రదర్శన చేసి తొలి మ్యాచ్ లో సునాయాసమైన విజయాన్ని సాధించింది. టైటిల్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన ఆ జట్టు సుడి ‘గేల్ ’ లేకున్నా తొలి మ్యాచ్ ని ఏకపక్షంగా ముగించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెలిల్స్ జట్టులో  డుమిని 48 బంతుల్లో 67 నాటౌట్, రాస్ టేలర్ 39 బంతుల్లో 43 నాటౌట్ తో చెలరేగడంతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసింది. రాయల్ ఛాలంజర్స్ జట్టు బౌలర్లు వరుణ్ అరోన్, మోర్కెట్, చాహల్ సమిష్టిగా రాణించి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు.

146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగుళూరు కెప్టెన్ కోహ్లీ 38 బంతుల్లో 49 నాటౌట్, యువరాజ్ సింగ్ 29 బంతుల్లో 52 నాటౌట్ తో చెలరేగడంతో లక్ష్యం చిన్నబోయింది. ఆరంభంలో కాస్తంత తడబడ్డ యువరాజ్ కొంత సేపటి తరువాత బ్యాట్ కి పని చెప్పి తనదైన సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినందుకు చాహల్ కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది. వెన్ను నొప్పి కారణంగా గేల్ తొలి మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles