Sehwag yuvraj ipl base price of 2 crore each

Sehwag, Yuvraj IPL base price,Yuvraj Singh,Virender Sehwag,Kevin Pietersen,Corey Anderson,IPL auction,

Sehwag Yuvraj IPL base price of 2 Crore each. The top 37 cricketers including Sehwag, Yuvraj and others have been slotted at a base price of Rs 2 crore.

వేలంలో వీరి కనీస ధర 2 కోట్లే

Posted: 01/30/2014 12:45 PM IST
Sehwag yuvraj ipl base price of 2 crore each

త్వరలో ఐపీఎల్ 2014 సీజన్ వేలం బెంగుళూరులో మొదలు కాబోతుంది. ఈ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వేలంలో ఉన్న ఆటగాళ్ళ జాబితాలో ప్రముఖ ఆటగాళ్ళు అయిన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, దినేష్ కార్తీక్, మురళీ విజయ్ లాంటి వారి పేర్లే కాకుండా మిగతా భారత ఆటగాళ్ళ కనీస రేట్లను నిర్ణయించి లీగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీల చేతికి అందించింది.

ఇందులో ఒకప్పుడు స్టార్ బ్యాట్స్ మెన్స్ గా వెలుగొందిన సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి వారి రేటు మరీ తక్కువగా 2 కోట్లు మాత్రమే నిర్ణయించింది. గత కొంత కాలంగా వీరిద్దరు సరైన ఫాంలో లేక భారత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.  ఢిల్లీ జట్టులో ఆడిన సెహ్వాగ్ ను ఆ జట్టు ప్రక్కన పెట్టగా, పుణె వారియర్స్ జట్టును ఐపీఎల్ నుండి తప్పించడంతో యువరాజ్ వేలంలోకి వచ్చాడు. ఈ జాబితాలో 48 మంది భారత జట్టుకు ఆడిన, ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు.

మొత్తం 11 మంది భారత క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్, జహీర్, పుజారా తమ కనీసధరను రూ.1.5 కోట్లుగా పేర్కొన్నారు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. ఐపీఎల్ కౌన్సిల్ నిర్ణయించిన కనీస ధరకైనా సెహ్వాగ్ , యువరాజ్ ను ఫ్రాంఛైజీలు తీసుకుంటాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles