World record beckons team india in odis

World record in ODIs, Team India, india tour of south africa 2013 14, ms dhoni, South Africa in the first one-day international

World record in ODIs, Team India, india tour of south africa 2013 14, ms dhoni, South Africa in the first one-day international

సఫారీల గడ్డ పై ప్రపంచ రికార్డుల్లోకి

Posted: 12/03/2013 12:34 PM IST
World record beckons team india in odis

ఇప్పటి వరకు స్వదేశంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీం ఇండియా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా వరుసగా ఆరు సిరీస్ లు గెలిచి ఆ రికార్డును అధికమించేందుకు ఉవ్విళ్ళూరుతుంది. ఆధునిక క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు 2002-04 సీజన్లలో కలిపి ఆస్ట్రేలియా వరుసగా పది సిరీస్ విజయాలు సాధించింది.

అలాగే 2009-10లో కూడా వరుసగా 9 సిరీస్‌లలో గెలిచింది. 2008-09 సీజన్‌లో కూడా భారత్ ఆరు సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు ధోనిసేనకు మంచి అవకాశం దొరికింది. రికార్డుల మాట అటుంచితే.. భారత్ కి విదేశీ పర్యటన అంటేనే లోపల గుబులు పుడుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం విదేశాల్లో చెత్త రికార్డును సొంతం చేసుకున్న టీం ఇండియా ఆ పరిస్థితిని కాస్తంత అధిగమించింది. కానీ గతంలో దక్షిణాఫ్రికా పర్యటన, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఘోరంగా ఓడి వచ్చి నానా చివాట్లు తిన్న టీం ఇండియా ఇఫ్పుడు సౌతాకాఫ్రికా టూర్ కి వెళ్లింది. ఈ సిరీస్ లో ఎలా రాణిస్తారు ?

విదేశాల్లో ఏ మాత్రం అనుభవం లేని కుర్రాళ్ళతో వెళ్ళిన ఈ జట్టు గతంలో సీనియర్స్ ఉన్న జట్టులానే ఓడి వస్తుందా ? లేక సఫారీలను ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుందా చూడాలి. ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు తీరు భారత్ కి కాస్తంత ఊరట నిచ్చే విషయం. పైగా గత కొంత కాలంగా భారత వన్డే జట్టు తిరుగు లేకుండా కనిపిస్తోంది. స్వదేశంలో విజయాల సంగతి పక్కన పెట్టినా...ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలో సాధించిన విజయం భారత్ సత్తా ఏపాటిదో చూపిస్తోంది. బౌలింగ్ ఫేస్ విభాగంలో కాస్తంత వెనకబడిన మనవాళ్ళు ఏ మాత్రం రాణిస్తారో చూడాలి. ఈ సిరీస్ లో భారత్ ఒక్క పరుగు చేస్తే వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles