Andy murray beats novak djokovic to win wimbledon

imbledon,Novak Djokovic,Fred Perry,Britain,Andy Murray

Andy Murray wins his first Wimbledon title and ends Britain 77-year wait for a mens champion with victory over Novak Djokovic.

ముర్రేకే వింబుల్డన్ టైటిల్

Posted: 07/08/2013 12:35 PM IST
Andy murray beats novak djokovic to win wimbledon

వింబుల్డన్ సాధించాలనుకోవడం ప్రతి టెన్నిస్ ఆటగాడికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి బ్రిటన్ మాత్రం 77 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది. 1936 తరువాత ఒక్క వింబుల్డన్ గెలవని బ్రిటన్ కి ముర్రే వింబుల్డన్ అందించి వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. ఈ విజయంతో 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత ఈ ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి బ్రిటన్ క్రీడాకారుడిగా ముర్రే గుర్తింపు పొందాడు. నిన్న జరిగిన పురుషుల సింగల్స్ ఫైనల్స్ హోరాహోరీ పోరాటంలో ఆండిముర్రే జొకోవిచ్ ని ఓడించి వింబుల్డన్ చాంపియన్‌గా అవరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే 6-4, 7-5, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలిచి కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 16 లక్షల పౌండ్లు (రూ. 14 కోట్ల 36 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది రోజర్ ఫెడరర్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన ముర్రే ఈసారి మాత్రం ఆరంభం నుంచి పూర్తి విశ్వాసంతో ఆడి విజేతగా అవతరించాడు. స్కాట్లాండ్‌కు చెందిన ముర్రే గత ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్‌నే ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. అయితే సొంత గడ్డ పై ముర్రే గెలిచిన తీరు యావత్తు టెన్నిస్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. టాప్ సీడ్ జొకోవిచ్ ఒక్కసెట్టు కూడా గెలవకుండా ఓడటం చూస్తుంటే... టెన్నిస్ శకంలో కొత్త అధ్యాయం మొదలైట్లే కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more