Royals face sunrisers in must win match

Rajasthan Royals, Sunrisers Hyderabad, RR vs SRH, IPL Play offs, IPL qualifiers, Rahul Dravid, Shane Watson, Shikhar Dhawan

Rajasthan Royals need to quickly recover from the shock arrest of their players on spot-fixing charges as they square-off against a desperate Sunrisers Hyderabad in their last Pepsi IPL league match on Friday

రైజర్స్ కి చావో రేవో

Posted: 05/17/2013 12:05 PM IST
Royals face sunrisers in must win match

గత సీజన్లలో అంతగా రాణించని హైదరాబాద్ జట్టు ఈ సారి కొత్త యాజమాన్యం ఆధ్యర్యంలో పేరు మార్చుకొని బరిలోకి దిగి అనూహ్య విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ రేసుకు చేరువలోకి చేరుకున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ కు అర్హత సుగమమం కావాలంటే నేడు రాజస్థాన్ రాయల్స్ తో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపులో ఉన్నా, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆ జట్టు ఆటగాళ్ళు  ఒత్తిడిలో ఉన్నారు. ఇక హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే కేవలం బౌలింగ్ నే నమ్ముకుని ఇంత దూరం  వచ్చిన రైజర్స్ బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేక పోతుంది. బౌలింగ్‌ మాత్రం స్టెయిన్‌, ఇశాంత్‌ శర్మ, డారెన్‌ సామి, లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, శ్రీలంక పేసర్‌ పెరీరా మంచి ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ కరణ్‌ శర్మ ఉన్నారు. అయితే వీరు కూడా చెన్నై, ముంబయి లాంటి జట్ల పై రాణించలేక ఓటమి పాలయ్యారు. బ్యాటింగ్ లో హైదరాబాద్‌ను ఓపెనర్‌ ధావన్‌, యువ ఆటగాడు విహారి, కెప్టెన్‌ సంగక్కార , పార్థివ్ లాంటి వాళ్ళు రాణిస్తే నే గెలుపు సాధ్యం అవుతుంది.

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే.... రాయల్స్‌ జట్టులోని డాషింగ్‌ హిట్టర్‌ వాట్సన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే కెప్టెన్‌ ద్రావిడ్‌ కూడా స్థిరంగా ఆడుతున్నాడు. అదేవిధంగా రహానే, సంజు సామ్సన్‌ టాప్‌ ఆర్డర్‌లో అద్వితీయంగా రాణిస్తూ పరుగులు కొల్లగొడుతున్నారు. వాట్సన్‌కు తోడు మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో స్టూవర్ట్‌ బిన్నీ పాత్ర అమోఘం. ద్రావిడ్‌ నాయకత్వంలోని ఆ జట్టు ఈ ఐపిఎల్‌ అందుకున్న పరాజయాల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం 20 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్‌లో స్థానం పొందినప్పటికీ, క్వాలిఫైయిర్‌లో ఆడాలంటే తప్పకుండా 22 పాయింట్లు అందుకోగలగాలి. దానికి నేటి మ్యాచ్‌లో విజయాన్ని అందుకోవడం తప్పనిసరి.

మరోవైపు హైదరాబాద్‌, బెంగళూరుతో సమంగా 16 పాయింట్లతో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ రెండింటిని వరుసగా గెలుచుకోగలగాలి. అదే బెంగళూరు ఒకే మ్యాచ్‌ ఆడవల్సి ఉండగా, అది గెలిచినా వారి పాయింట్ల సంఖ్య 18 కి చేరుకుంటుంది. రైజర్స్‌ వరుసగా రెండింటిని గెలువగలిగితే బెంగళూరు నిష్ర్కమించాల్సిందే. భారీ స్కోరుకు సమాధానం చెప్పలేక ఐదు మ్యాచ్‌ల విజయాల అనంతరం పరాజయం పాలైన ఆ జట్టుకు ఈ మైదానంలో తమ అవకాశాలు పెంచుకోవడానికి ఇదో మంచి చాన్స్‌. చూద్దాం సన్ రైజర్స్ ఏమి చేస్తుందో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more