పట్టుదలతో శ్రమిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని, తాను సాధించిన విజయాలకు కూడా ఇదే మూల సూత్రమని భారత స్టార్ షట్లర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. . ఆమె రాసిన ‘ప్లేయింగ్ టు విన్ - మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్’ అనే పుస్తకం మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా షూటింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించిన గగన్ నారంగ్‌తో కలిసి విలేఖరులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పుస్తకం రాసినందుకు కారణాలను వివరించింది. ‘ఆటోబయోగ్రఫీ అంటే రిటైర్మెంట్ తర్వాత, పెద్ద వయసులో రాయడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఈ స్థాయికి చేరేందుకు నేను 13 ఏళ్ల పాటు తీవ్రంగా శ్రమించాను. నా అనుభవాల నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకుంటారని, దానిని చెప్పేందుకు ఇదే సరైన సమయంగా భావించి రచయితగా మారాను’ అని తన మనసులో మాట వెల్లడించింది. మరో ఒలింపిక్ విజేత షూటర్ గగన్ నారంగ్ ‘ల్యాండ్‌మార్క్’ స్టోర్స్ లో బుక్ ఆవిష్కరించాడు. ప్రముఖ సంస్థ పెంగ్విన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
ఇంకా సైనా ఏమందంటే.. క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అందుకోవడం సాధ్యమని పేర్కొంది. ప్రతి విజయం తర్వాత ఐస్‌క్రీమ్ తినేదానినని, ఇప్పుడు ఫిట్నెస్‌ను కాపాడుకునే క్రమంలో ఆ అవకాశం లభించడం లేదని తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు ఉంటే, అంతర్జాతీయ వేదికలపై భారత్ మరిన్ని పతకాలను సాధిస్తుందని తెలిపింది. యువతకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? అని అడిగితే.. పట్టుదల, అంకిత భావం ప్రతి ఒక్కరికీ అత్యవసరమని పేర్కొంది. నిరంతర సాధనతోనే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని తెలిపింది. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుందని సైనా చెప్పింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more