Lagadapati rajagopal focus on congress party

lagadapati rajagopal focus on congress party, Lagadapati Rajagopal hot comments on congress party, rachabanda, ap bifurcation, telangana issue, cm kiran, samaikyandhra

lagadapati rajagopal focus on congress party, Lagadapati Rajagopal hot comments on congress party

తన్నుకుపోతుంటే చేతులు చాచి కూర్చునేది లేదు : లగడపాటి

Posted: 11/15/2013 08:32 PM IST
Lagadapati rajagopal focus on congress party

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా వీరులపాడు రచ్చబండలో పాల్గొన్న లగడపాటి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. రాజధానిగా భావించే పలు కంపెనీలు, విద్యాసంస్థలు పెట్టారని అలాంటిది రాజధాని వదిలిపోవాలంటే సహించేది లేదని ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు.

 

రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రపతి ఆమోదం మేరకే పార్టమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి రాజకీయ పార్టీలే కారణమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని సైతం వదులుకోవాడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ అందరిదని, దానిని తన్నుకుపోతుంటే చేతులు చాచి కూర్చునేది లేదన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 60 శాతం ఆదాయం హైదరాబాదు నుంచి వస్తుందన్నారు.

 

ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో ఉండటం వల్ల అక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పారు. యూపీఏ రాష్ట్ర విభజనలో దూకుడుగా ఉన్నప్పటికీ రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులమంతా అధిష్టానంపై తిరగబడతామని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బిల్లును ఆమోదిస్తేనే విభజన జరగుతుంది తప్ప ఆమోదం లేకుంటే విభజన జరగదన్నారు. సీఎం కిరణ్ పదవిలోఉన్నంత కాలం విభజన ప్రసక్తే ఉండదన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more