విజయవాడ ఎంపీ రాజగోపాల్ నిర్వహించనున్న జగ్గయ్యపేట పర్యటనను బహిష్కరించాలని అసమ్మతి కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దూళిపాళ లక్ష్మణరావు ఇంట్లో సమావేశమైన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎంపీ రాజగోపాల్ తాము లేవనెత్తిన అంశాలపై ఏవిధంగా స్పందించక పోవటంతో తాము విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత కొద్ది రోజులు గా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సం బంధించి సీనియర్ నేతలతోగాని, పార్టీ బాధ్యులతో గాని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పార్థ్థసారథి పర్యటనను బహిష్కరించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే తమను విస్మరించటం పార్టీకి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని వివరించారు. పార్టీ నేతల అల్టిమేటమ్పై ఎంపీ స్పందించ లేదు. పైగా నియోజకవర్గంలో జరగునున్న పర్యటనపై నేతలకు సమాచారం ఇవ్వలేదు. దాంతో ఎంపీ పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more