Actor Suman Talks About His Bollywood Entry With Gabbar Is Back Movie

Actor suman bollywood entry gabbar is back movie updates akshay kumar

suman news, actor suman updates, suman movies, gabbar is back movie, gabbar is back updates, suman gallery, gabbar news, akshay kumar, shruti hassan news, tagore movie, tamil ramanaa movie

Actor Suman Bollywood Entry Gabbar Is Back Movie Updates Akshay Kumar : Actor Suman Talks About His Bollywood Entry With Gabbar Is Back Movie. Also praises the actor akshay kumar.

సుమన్

Posted: 05/01/2015 01:26 PM IST
Actor suman bollywood entry gabbar is back movie updates akshay kumar

దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో కథానాయకునిగా, సహాయ నటునిగా, ప్రతినాయకునిగా వంటి విభిన్న పాత్రల్లో నటుడు సుమన్ జీవం పోశారు. దేవుడి పాత్రల్లో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తన ప్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఇప్పుడు ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’) ఆధారంగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా రూపొందిన ఈ చిత్రంలో సుమన్ ప్రతినాయకునిగా నటించారు.

ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌ ‘శివాజీ’లో నేను విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. అప్పుడు ఆ సినీరంగం నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ.. ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అయితే బాగుంటుందనుకున్నా. అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేశాను. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సరైన సినిమా అనిపించి, వెంటనే అంగీకరించాను’ అంటూ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆయన వివరించారు. ఈ క్రమంలోనే నటుడు అక్షయ్ కుమార్ గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో వీరిమధ్య జరిగిన సంభాషణలు, ఇతర వివరాలు తెలియపరిచారు.

ఈ నేపథ్యంలోనే ఆయన అక్షయ్ గురించి మాట్లాడుతూ.. ‘అక్షయ్‌కుమార్‌కీ మార్షల్ ఆర్ట్స్ తెలుసు. నాకూ వచ్చు. దాంతో ఫైట్ సీన్స్‌ని చాలా సహజంగా చేశాం. నాకు తెలిసి భారతీయ సినిమాలో రిస్క్ తీసుకుని ఫైట్స్ చేసేది అక్షయ్‌కుమారే. అటువంటి ఆయన అంత సులువుగా ఎవర్నీ అభినందించరట. ఆయనే స్వయంగా ‘ఈ వయసులో మీరు బాగా ఫైట్స్ చేస్తున్నారు’ అని నన్ను ప్రశంసించడం మరిచిపోలేను. ఈ ఏడాది హిందీ రంగానికి పరిచయం కావడం ఓ విశేషం అయితే, ఏకకాలంలో నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందిన ‘రెడ్ అలర్ట్’లో నటించడం మరో విశేషం’ అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suman  Gabbar is back  Akshay Kumar  Shruti Hassan  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more