Trs mla harish rao comment on cm kiran kumar reddy

trs mla harish rao, cm kiran kumar reddy, cm kiran vs harish rao, chief minister kiran kumar reddy, polavaram project

trs mla harish rao comment on cm kiran kumar reddy

cm-kiran-kumar-reddy.gif

Posted: 03/06/2013 05:57 PM IST
Trs mla harish rao comment on cm kiran kumar reddy

trs mla harish rao comment on cm kiran kumar reddy

పోలవరం టెండర్లను ట్రాన్స్‌స్ట్రాయ్-యూఈఎస్ జాయింట్ వెంచర్‌కు కట్టబెట్టిన వ్యవహారంలో సీఎం కిరణ్‌పై టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోర్జరీపత్రాలతో టెండర్లలో పాల్గొన్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. "ముఖ్యమంత్రి కిరణ్ ఆయనకు ఆయనే..నేను మిస్టర్ క్లీన్..మిస్టర్ పర్‌ఫెక్ట్ అని చెప్పుకుంటారు. అదే నిజమైతే..ఆయన డిఫెక్ట్ కాకపోతే..పోలవరం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలి, సీబీఐ విచారణకు ముందుకు రావాలి'' అని సవాల్ చేశారు.  అన్ని అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. అప్పుడు కిరణ్ ముఖ్యమంత్రా లేక మురికిమంత్రా అన్న విషయం తేలుతుందని చెప్పారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని రష్యా తేల్చిన తర్వాత కూడా దానికే టెండర్లు ఇవ్వటం వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామని, చివరిదాకా పోరాడుతామని స్పష్టం చేశారు. సీవీసీ, లోకాయుక్త సహా అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎందుకో మౌనంగా ఉందని అన్నారు. టెండర్లు పొందిన ట్రాన్స్‌స్ట్రాయ్-యూఈఎస్ జాయింట్ వెంచర్ కంపెనీ అనుభవ డాక్యుమెంట్లు ఫోర్జరీవని.. దీనిపై విచారణకు వెళ్లిన అధికారులు అదే కంపెనీ ఆతిథ్యం తీసుకుని చూసీ చూడనట్లు వదిలేశారని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లో షాపూర్‌కండి డ్యాం కోసం ఇదే సంస్థ ఫోర్జరీ పత్రాలతో టెండర్లు దాఖలు చేయగా ఆ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందని, అలాంటిది మన ప్రభుత్వం మాత్రం వాళ్లను నెత్తిన పెట్టుకుందని విమర్శించారు. రాత్రికి రాత్రే పోలవరం టెండర్లు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Abhayam scheme on congress government
Hyderabad twin blasts police begins operation bicycle hunt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more