ప్రేమలోని తీపి, చేదు రెండూ నాకు బాగా తెలుసని అంటుంది మడోన్నా. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దర్శకురాలిగా చేయడం ఆమెకిది తొలిసారి కాదు. ఇప్పటికే కొన్ని వాణిజ్య ప్రకటనలు, ఓ లఘు చిత్రం, రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దర్శకత్వం వహించనున్న చిత్రానికి ఓ నవలను ఆధారంగా చేసుకుంటున్నారు.
ఓ నల్లజాతి యువకుడు, తెల్లజాతి యువతి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. సమాజం విధించిన కట్టుబాట్ల కారణంగా పెళ్లి చేసుకోవాలన్న ఈ ఇద్దరి ఆశయం ఎలా నీరుగారిపోయింది? అనే అంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఇలాంటి ఓ మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించడానికి అన్ని అర్హతలు కలిగిన డెరైక్టర్‌ని తానేనని మడోన్నా చెబుతూ - ‘‘ప్రేమలోని తీపి, చేదు రెండూ నాకు బాగా తెలుసు.
వ్యక్తిగతంగా ఈ రెండూ నాకు అనుభవమే. అందుకే లవ్‌స్టోరీ తీయడానికి అర్హత ఉన్న డెరైక్టర్‌ని అని చెబుతున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఈ నవలా చిత్రాన్ని ఓ అందమైన పెయింటింగ్‌లా తీయాలనే సన్నాహాల్లో మడోన్నా ఉన్నారని సమాచారం.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more