Baahubali The Conclusion | SS Rajamouli | Karan Johar | Prabhas | Rights

Bollywood producers trying for baahubali the conclusion rights

Baahubali The Conclusion rights, Bollywood wait for Baahubali The Conclusion rights, Baahubali The Conclusion latest news, Baahubali The Conclusion shooting updates, Baahubali The Conclusion movie news, Baahubali The Conclusion updates, Baahubali The Conclusion trailers, Karan johar Baahubali The Conclusion

Bollywood producers trying for Baahubali The Conclusion rights: SS Rajamouli upcoming film Baahubali The Conclusion. Prabhas, Anushka, Rana, Ramyakrishna, Satya raj, Nasar acts in lead roles.

‘బాహుబలి2’ కోసం బాలీవుడ్ ఆరాటం

Posted: 02/05/2016 04:45 PM IST
Bollywood producers trying for baahubali the conclusion rights

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ కలెక్షన్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ‘బాహుబలి’ చిత్రం కేవలం హిందీ వర్షెన్ లోనే 100కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

హిందీలో ‘బాహుబలి’ హక్కులను ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ సొంతం చేసుకున్నాడు. హిందీలో కరణ్ జోహర్ ‘బాహుబలి’ని చాలా గ్రాండ్ గా విడుదల చేసారు. అలాగే పబ్లిసిటీ పరంగా కూడా మోత మోగించేసాడు. ‘బాహుబలి’ హిందీ వర్షెన్ విజయంలో కరణ్ జోహర్ పాత్ర కూడా కాస్త వుందని చెప్పుకోవచ్చు.

‘బాహుబలి’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ‘బాహుబలి- కంక్లూజన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడుతోంది. అయితే ‘బాహుబలి- కంక్లూజన్’ హిందీ హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలను దాదాపు 150 కోట్ల భారీ ఆఫర్ తో కలిసారట. కానీ ఇప్పుడేమి చెప్పలేమంటూ ఆ నిర్మాతను ‘బాహుబలి’ చిత్ర నిర్మాతలు పంపించేసారని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ‘బాహుబలి- కంక్లూజన్’ హిందీ హక్కులను కూడా కరణ్ జోహర్ కే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ‘బాహుబలి’ సినిమా హిందీ వర్షెన్ విడుదల సమయంలో కరణ్ జోహర్ అందించిన సహకారం మరువలేదని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకే ఇప్పుడే ‘బాహుబలి-కంక్లూజన్’ బిజినెస్ గురించి ఆలోచించడంలేదు ‘బాహుబలి’ దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, రానా, నాజర్, సత్యరాజ్ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ‘బాహుబలి’ సినిమా విజయం వల్ల ఈ సెకండ్ పార్ట్ పై అంచనాలు తారాస్థాయిని చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Karan Johar  SS Rajamouli  Rights  Movie updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more