Akash puri andhra puri movie late health problem update

akash puri health problem, akash puri debut movie, puri akash debut movie latest updates, puri akash movie late reasons, puri akash latest updates, andhra pori cast and crew, puri jagannath latest updates, tollywood latest news updates

akash puri andhra puri movie late update : puri akash debut movie andhra pori started pooja but there is a rumor that akash got treatment for some of health problem and got treated by a famous doctor in hyderabd. with health check-up and treatments only akash puri debut movie got late

ఆరోగ్య సమస్యల వల్లే ఆకాశ్ ఆలస్యం...?

Posted: 12/19/2014 11:32 AM IST
Akash puri andhra puri movie late health problem update

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘ఆంధ్రాపోరి’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారమే జరిగాయి. జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. టాలీవుడ్ కు వస్తున్న కొత్త హీరోను అందరూ ఆశీర్వదించారు. అయితే ‘ఆకాష్’ హీరోగా ఎంట్రీ ఇస్తాడని రెండు నెలల క్రితమే చెప్పారు. ఈ విషయమై పూరిని వివరణ కోరగా.., అవును సినిమా చేస్తాడు. అయితే ఇప్పుడు కాదు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అని చెప్పాడు. కాని విద్యా సంవత్సరం పూర్తి కాకముందే సినిమా మొదలు పెట్టాడు. అప్పుడు ఎందుకు చేయలేదు.., ఇప్పుడు ఎందుకు ప్రారంభించారు అని ఆరాతీస్తే అసలు విషయం బయట పడింది.

పూరీ జగన్నాథ్ తనయుడికి రెండు నెలల క్రితం ఆరోగ్య సమస్య ఉందట. కీళ్లకు సంబంధించిన సమస్య తో బాధపడినట్లు సన్నిహితులు తెలిపారు. అలా ఇబ్బందులు పెట్టుకుని ఇండస్ర్టీలోకి వస్తే బాగోదు.., అంతేకాకుండా అవకాశాలు ఎక్కువైతే చికిత్స చేయించుకోవటానికి కూడా సమయం ఉండక ఇబ్బందులు, ఆ సమయంలో వచ్చే పుకార్లను భరించలేము. కాబట్టి ముందే చికిత్స చేయించుకోవటం ఉత్తమంగా భావించి.., హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ దగ్గర పిజియోథెరపీ చేయించుకున్నాడని తెలిసింది. రోజు వెళ్ళి చికిత్సా చేయించుకున్నాడు. ఆ తర్వాత కీళ్ల సమస్య లేకపోవటంతో సినిమా మొదలు పెట్టారని తెలుస్తోంది.

అయితే ఈ కీళ్ళ సమస్య పెద్ద ఇబ్బందికరమైనదేమి కాదు.., కాకపోతే షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు, డాన్స్ చేయాల్సి వస్తే కీళ్లు ఇబ్బంది పెడితే తట్టుకోవటం కష్టం. దీనికి తోడు ఇతర ఇబ్బందులు కూడా వస్తాయని ముందుజాగ్రత్తగా ఇబ్బంది చిన్నదైనా చికిత్స ఇప్పించారు. ప్రస్తుతం పర్ ఫెక్ట్ అండ్ హెల్తీగా ఉన్న ఆకాష్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఉల్కా గుప్తాతో ‘ఆంధ్రా పోరీ’ అంటూ ఆడి, పాడి అందర్నీ ఆలరించేందుకు సిద్దమవుతున్న ఈ యువ హీరోకు ‘తెలుగు విశేష్’ ఆల్ ది బెస్ట్ చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akash puri debut  akash health problem  andhra pori latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more