ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' నుంచి విడుదలైన తొలి సింగిల్ అల్ టైమ్ రికార్డును అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. వచ్చే నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు.
'దాక్కో దాక్కో మేక .. ' అంటూ ఈ పాట కొనసాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శివమ్ ఆలపించాడు. ఈ కథ అడవి నేపథ్యంలో సాగుతుంది .. అందువలన ఆటవిక న్యాయాన్ని గురించి చెబుతూ ఈ పాట నడుస్తుంది. ఈ సాంగ్ లో పుష్పరాజ్ గా బన్నీ గెటప్ - హావభావాలు చాలా కొత్తగా ఉన్నాయి. ఇక తనదైన స్టైల్ లో పూనకం వచ్చిన వాడిలా ఊగుతూ వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు.దేవిశ్రీ ప్రసాద్ బీట్ తో పాటు, కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇలా ఈ పాటను వదిలారో లేదో అలా దూసుకుపోయింది. 182 నిమిషాల్లోనే 400K లైక్స్ ను సాధించింది. టాలీవుడ్ లో ఇంతవరకూ ఇంత వేగంగా .. ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ ని సాధించిన లిరికల్ వీడియో ఇదేనని చెబుతున్నారు. ఫస్టు సింగిల్ తోనే కొత్త రికార్డును సాధించిందని చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కు విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more