Ravi Teja to play Tiger Nageshwara Rao రామారావు తరువాత నాగేశ్వర్రావ్.. లైన్లోపెట్టిన రవితేజ

Ravi teja to play lead role in biopic of tiger nageshwara rao

Ravi Teja, Tiger Nageshwara Rao, Abhishek Agarwal, Tirnath Rao Nakkina, Khiladi, RamaRao On Duty, dangerous thief, Stuartpuram, Bellamkonda Srinivas, Dagubati Rana, Tollywood, movies, Entertainment

Mass Maharaja Ravi Teja is going to play the lead role in an upcoming Telugu film which is a biopic of Tiger Nageshwara Rao. Biopic of Tiger Nageswara Rao, who was known as one of most dangerous thieves is on the cards for a long time.

రామారావు తరువాత నాగేశ్వర్రావ్.. లైన్లోపెట్టిన రవితేజ

Posted: 08/09/2021 08:48 PM IST
Ravi teja to play lead role in biopic of tiger nageshwara rao

కరోనా రావడానికి ముందు 'టైగర్ నాగేశ్వర్రావ్' పేరు వినిపించింది. అతను ఒక స్టువర్టుపురం దొంగ..  1970 - 80లలో వరుస దొంగతనాలతో హడలెత్తించినవాడు. దొంగతనాలు చేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉండేది. అందువలన ఆయనను పట్టుకోవడం అసాధ్యంగా మారేది. అలాంటి 'టైగర్ నాగేశ్వర్రావ్' స్టోరీని వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించాలని అనుకున్నాడు.

ఈ ప్రాజెక్టు కోసం ఆయన రెండేళ్ల  క్రితమే రంగంలోకి దిగాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనప్పుడే, కరోనా విరుచుకుపడటం జరిగింది. ఆ తరువాత అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. అప్పట్లో ఈ సినిమాలో రానాగానీ .. బెల్లంకొండ శ్రీనివాస్ గాని నటించే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రవితేజ పేరు తెరపైకి వచ్చింది.

వంశీకృష్ణ ఆకెళ్ల ఇటీవల రవితేజను కలిసి ఈ కథను చెప్పాడట. ఈ కథ .. కథనం .. పాత్ర తీరు తెన్నులు నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఖిలాడి' షూటింగును పూర్తిచేసిన రవితేజ, 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగులో ఉన్నాడు. ఆ తరువాత ఆయన త్రినాథరావు నక్కినతో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Tiger Nageshwara Rao  Abhishek Agarwal  Tirnath Rao Nakkina  Tollywood  

Other Articles