Manikarnika Teaser Is A Hit On Twitter ఝాన్సీ రాణి మణికర్ణిక మళ్లీ పుట్టిందా.!

Manikarnika teaser kangana ranaut looks fierce as queen of jhansi

The Queen of Jhansi, manikarnika, Radha krishna Jagarlamudi, manikarnika teaser, Manikarnika movie, Kangana Ranaut, amitabh bachchan, bollywood, latest movie news, tollywood, movies, entertainment

The teaser of Manikarnika, the film based on Rani of Jhansi, is here. After many stills from the sets of the film, the audience gets to watch the teaser of the film and it looks quite grand.

మణికర్ణిక టీజర్: ఝాన్సీలక్ష్మీభాయ్ మళ్లీ పుట్టిందా!

Posted: 10/02/2018 05:41 PM IST
Manikarnika teaser kangana ranaut looks fierce as queen of jhansi

ధైర్య సాహసాలకు, దేశంలోని మహిళామణులకు ఆనాటి నుంచి నేటి వరకు ఆదర్శానికి ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సైన్యాన్ని తయారు చేసిన గొప్ప పాలకురాలు. ఆంగ్లేయుల దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత. ఆమె జీవిత కథ ఆధారంగా రూపోందించిన చిత్రం మణికర్ణిక మరో మూడు మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంగ్లేయులతో అలుపెరగకుండా పోరాడి దేశం కోసం ప్రాణాలు ఒదిలిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవిత ప్రాముఖ్యతను నేతి తరానికి సినిమా క్లుప్తంగా చెప్పనుంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఝాన్సీ రాణి పాత్రలో ఒదిగిపోయారు. రాణి లక్ష్మీబాయి అసలు పేరు ‘మణికర్ణిక’నే చిత్ర టైటిల్ గా పెట్టారు. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలైంది. జాతిపిత మహాత్మ గాంధీ 150వ జయంతిని పురష్కరించుకుని ‘మణికర్ణిక’ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఝాన్సీ రాణి మళ్లీ పుట్టింది అనిపిస్తోంది. ఝాన్సీ రాణి పేరుకు తగ్గట్టుగా ఆ పాత్రలో వీరత్వాన్ని కంగనా కళ్లకు కట్టినట్టు చూపించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభం కాగా, లక్ష్మీబాయి పాత్రలో కంగనా చాలా హుందాగా కనిపిస్తున్నారు. బిడ్డను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు తల్లిగా చాలా సున్నితంగా కనిపించిన కంగనా.. రణరంగంలో పోరాట యోధురాలిగా తన విశ్వరూపాన్ని చూపించారు. సినిమాలో సెట్లు, చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తితో ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : The Queen of Jhansi  manikarnika  Krish  teaser  Kangana Ranaut  amitabh bachchan  bollywood  

Other Articles