Tanushree Dutta hurts on Big B’s response ఆఫ్ స్ర్కీన్ లో అమితాబ్ కళ్లుకు అంధకారం

Tanushree dutta on big b s response evasive responses make no sense

Tanushree Dutta, Nana Patekar, Amitabh Bachchan, Tanushree Dutta sexual harassment, Tanushree Nana Patekar, Tanushree Dutta Bollywood, tollywood, latest movie news, movies, entertainment

Most of the industry has still perhaps decided to stay mum, I’m trying to see how far that goes,” says a tired yet confident Tanushree Dutta.

బిగ్ బి కూడా కళ్లు మూసుకుంటారు: తనుశ్రీ దత్తా

Posted: 10/01/2018 06:25 PM IST
Tanushree dutta on big b s response evasive responses make no sense

బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పింది. దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు.

అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను.. తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని వ్యాఖ్యానించింది.

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తాను 30-40 సినిమా ఆఫర్లను వదులుకున్నానని ఆమె బయటపెట్టింది. తనకు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉందనీ, త్వరలోనే తాను అమెరికాకు వెళ్లిపోతానని తెలిపింది. బాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది. తనకు పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారనీ, కాని ప్రజల నుంచి మాత్రం నైతిక మద్దతు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanushree Dutta  Nana Patekar  Amitabh Bachchan  sexual harassment  Bollywood  

Other Articles