Mohan Babu Responds On Fasak కింగ్ డైలాగ్ చెబితే ట్రెండింగ్ కావాల్సిందే..

Fasak it s trending and only actor mohan babu can say what the word means

mohan babu, fasak, Dialogue King, collection king, mohan babu manchu, India Today, Rajdeep sardesai, Manchu Vishnu, Manchu Lakshmi, Manchu Manoj, tollywood, movies, entertainment

A new word ‘fasak’ has taken the internet by storm. And only 68-year-old Telugu actor Mohan Babu can tell what it means. And what could be the language.

కింగ్ డైలాగ్ చెబితే ట్రెండింగ్ కావాల్సిందే..

Posted: 09/04/2018 06:45 PM IST
Fasak it s trending and only actor mohan babu can say what the word means

తెలుగు సినీ పరిశ్రమలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ అన్న పేరూ కూడా వుంది. కాలక్రమేనా ఆయన సినిమాలు హిట్ కావడం లేదే తప్ప.. ఆయన డైలాగ్ డెలివరీలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. అందుకే ఆయన డైలాగ్ డెలివరీలోనూ కింగ్ అనిపించుకున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా.. ఎన్నో డైలాగులు చెప్పింది.. వాటిని తన ఆయా చిత్రాల్లో పదే పదే ఊతపదంలా వాడింది కూడా ఆయనే. అరిస్తే చరుస్తా అంటూ అసెంబ్లీ రౌడీ నుంచి ప్రేక్షకులకు గుర్తుపెట్టుకున్నా ఆయన విలన్ వేషాలు వేసే సమయంలోనూ ఈ డైలాగులే ఆయన ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. తాజాగా ఇప్పటి సోషల్ మీడియా యుగంలోనూ ఒక్క డైలాగుతో ట్రెండ్ సెట్ చేశారు.

ఇటీవల ఓ ఇంగ్లిష్ ఛానెల్‌కు మోహన్ బాబు, ఆయన కుమార్తె లక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు డైలాగులు చెప్పే విధానం చర్చకొచ్చింది. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ ను అనుసరించేవాడినని, గురువుగారు దాసరి ఇచ్చే విలువైన సూచనల్ని పాటిస్తూ డైలాగ్స్ చెప్పడంలో కింగ్ లా పేరు తెచ్చుకున్నానని మోహన్ బాబు చెప్పారు. మచ్చుకు ‘ఎం ధర్మరాజు ఎంఏ’ మూవీలో తను పోషించిన తండ్రీకొడుకుల పాత్రలకు సంబంధించి ఒక డైలాగ్ అంగ్లంలో వివరించడం.. అది కాస్తా సోషల్ మీడియాలో ట్రాల్ అయ్యింది. అందుకు కారణం ఆయన మాట్లాడిన ఇంగ్లీషే.

తన భార్యను చంపేయమని ధర్మరాజు తన పనోడికి చెప్తాడని చెప్పారు. ‘పొడిచి పొడిచి చంపడం కాదురా.. ఒకే దెబ్బ ఫసక్’ అని సినిమాలో డైలాగ్ ఉంటుందని మోహన్‌బాబు ఎడమ చేతితో సైగ చేస్తూ చెప్పారు. ఆ మూడక్షరాల మాట ఇప్పుడు తెలుగు నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ఈ మాట మీద వందలకొద్దీ మీమ్స్, స్పూఫ్‌లు పుట్టుకొచ్చేశాయి. రకరకాల వీడియాలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా డైలాగులో భాగంగా యథాలాపంగా తను పలికిన ఆ ఒక మాట ఇంత వేగంగా వైరల్ కావడంతో మోహన్ బాబు కూడా ముగ్ధుడయ్యారు.

‘‘#fasak ఇది ట్రెండ్ అవుతోందని తెలుసుకుని చాలా సంతోషించాను. నేను వాడిన మాటను ఉపయోగించి దాదాపు 200 స్పూఫ్‌ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను. చాలా ఇన్నోవేటివ్‌గా, ఫన్నీగా ఉన్నాయి’ అని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. అయితే ఇంతలా ట్రోల్ చేస్తున్నా మోహన్‌బాబు సరదాగా ట్వీట్ చేయడంపై ట్రోల్ రాజాలు షాక్‌కు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohan babu  fasak  M Dharma Raju MA  Manchu Lakshmi  India Today  Rajdeep sardesai  tollywood  

Other Articles